News
బాలికల రక్షణ మరియు సంక్షేమము కమిటీ మొదటి సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ 35వ వార్డులో బాల్య వివాహాల నిర్మూలన, బాలికల సంరక్షణ కోసం 35వ వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ అధ్యక్షతన సచివాలయ మహిళా వెల్ఫేర్ సెక్రటరీ పవిత్ర ఆధ్వర్యంలో మొదటి సమావేశం ఏర్పాటుచేసుకుని 35వ వార్డులో చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, ఆడపిల్లలను బడికి పంపకుండా కూలీ పనులకు పంపించడం చాలా ఎక్కువగా ఉన్న విషయాలపైన బాలికల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత నాగరిక ప్రపంచంలో బాలికలు తమ జీవితాన్ని వారి పిల్లల జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి చదువు యొక్క అవసరాన్ని తెలియచేయడమే కాకుండా చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వచ్ఛే వివాహానంతరం సంసారం, సంతానం వల్ల కలిగే ఇబ్బందులు మొదలగు విషయాలపైన ప్రతి 15రోజులకు ఒక తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని మొదటి సమావేశములో తీర్మానం చేయడమైనదని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ తెలిపారు.ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ మా వార్డులో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం వలన ఆడపిల్లల తల్లిదండ్రులకు సరియైన అవగాహన లేకపోవడం వలన పదమూడు, పదునాలుగు సంవత్సరాలలో పెళ్ళిళ్ళు చేస్తున్నారని అందువల్ల ఆడపిల్లల చిన్న వయసులోనే గర్భధారణ జరగడం, తద్వారా ప్రసవసమయములో చాలా మంది రక్తహీనత వలన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారని వీటన్నింటికీ మా చేతనైన పరిష్కారం చూపడము కోసము మేము ఈ కమిటీ చేసుకున్నామని తెలిపారు.ఈ కమిటీలో హైస్కూల్ టీచర్ ప్రసన్నకుమారి,ఎఎన్నెమ్ ఈరమ్మ, అంగన్వాడీ సూపర్ వైజర్,వసంతమ్మ, సామాజిక కార్యకర్త మరియు కవయిత్రి జంగం స్వయంప్రభ, అంగన్వాడీ కార్యకర్తలు గ్రేసమ్మ, శ్యామల, పొదుపు ఆర్పీలు, ఫాతిమా, కళావతిని అలాగే యశోద,షాబీర మొదలైన వారిని సభ్యులుగా పనిచేయుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వెల్లాల లలితమ్మ తెలిపారు.

News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
లారీ కింద పడి బాలుడు మృతి
-
News4 weeks ago
హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష