Connect with us

News

బాలికల రక్షణ మరియు సంక్షేమము కమిటీ మొదటి సమావేశం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ 35వ వార్డులో బాల్య వివాహాల నిర్మూలన, బాలికల సంరక్షణ కోసం 35వ వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ అధ్యక్షతన సచివాలయ మహిళా వెల్ఫేర్ సెక్రటరీ పవిత్ర ఆధ్వర్యంలో మొదటి సమావేశం ఏర్పాటుచేసుకుని 35వ వార్డులో చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, ఆడపిల్లలను బడికి పంపకుండా కూలీ పనులకు పంపించడం చాలా ఎక్కువగా ఉన్న విషయాలపైన బాలికల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత నాగరిక ప్రపంచంలో బాలికలు తమ జీవితాన్ని వారి పిల్లల జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి చదువు యొక్క అవసరాన్ని తెలియచేయడమే కాకుండా చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వచ్ఛే వివాహానంతరం సంసారం, సంతానం వల్ల కలిగే ఇబ్బందులు మొదలగు విషయాలపైన ప్రతి 15రోజులకు ఒక తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని మొదటి సమావేశములో తీర్మానం చేయడమైనదని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ తెలిపారు.ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ మా వార్డులో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం వలన ఆడపిల్లల తల్లిదండ్రులకు సరియైన అవగాహన లేకపోవడం వలన పదమూడు, పదునాలుగు సంవత్సరాలలో పెళ్ళిళ్ళు చేస్తున్నారని అందువల్ల ఆడపిల్లల చిన్న వయసులోనే గర్భధారణ జరగడం, తద్వారా ప్రసవసమయములో చాలా మంది రక్తహీనత వలన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారని వీటన్నింటికీ మా చేతనైన పరిష్కారం చూపడము కోసము మేము ఈ కమిటీ చేసుకున్నామని తెలిపారు.ఈ కమిటీలో హైస్కూల్ టీచర్ ప్రసన్నకుమారి,ఎఎన్నెమ్ ఈరమ్మ, అంగన్వాడీ సూపర్ వైజర్,వసంతమ్మ, సామాజిక కార్యకర్త మరియు కవయిత్రి జంగం స్వయంప్రభ, అంగన్వాడీ కార్యకర్తలు గ్రేసమ్మ, శ్యామల, పొదుపు ఆర్పీలు, ఫాతిమా, కళావతిని అలాగే యశోద,షాబీర మొదలైన వారిని సభ్యులుగా పనిచేయుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వెల్లాల లలితమ్మ తెలిపారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల

Published

on

రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల చేయడం పట్ల   టిడిపి ఏపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి. గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ గడ్డా ఫకృద్దీన్ హర్షం వ్యక్తం చేసారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గడ్డా ఫకృద్దీన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముస్లింల ప్రార్ధన మందిరాలైన మసీదులలో ప్రార్ధనలు నిర్వహించే ఇమామ్, మౌజన్ లకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసి వారిలో ఆనందం నింపారని తెలిపారు.ఈ నిర్ణయం ముస్లిం సమాజానికి ఎంతో  సంతోషం కలిగించిందని, కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అధికశాతం ముస్లిం సోదరులు అభిప్రాయపడుతున్నారని ఆనందం వ్యక్తం చేసారు.
ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట సమయం వెసులుబాటు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని, ఉపవాసం ఆచరించే వారికి ఎటువంటి ఆటంకం లేకుండా వారికి సమయం ఇచ్చారని   గడ్డా ఫకృద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  ఎన్ ఎమ్ డీ  ఫారూఖ్ లకు గడ్డా ఫకృద్దీన్    కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

ముఖ్యమైన వార్తలు

Published

on

15వ తేదీ శనివారం ఫిబ్రవరి 2025 నలుదిక్కుల ముఖ్యమైన వార్తలు..
◆ రాజమండ్రిలో నకిలీ కరెన్సీ పట్టివేత ఐదుగురి అరెస్ట్ కోటి రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం..
◆ సూర్యాపేట జిల్లా బొజ్జ గూడెం లో కూలీల ఆటో బోల్తా పదిమందికి గాయాలు
◆ జనసేన నేత కిరణ్ రాయల్ బాగోతాలు.. ఆధారాలతో బయటపెట్టిన బాధితురాలు లక్ష్మి.. పవన్ కళ్యాణ్ అండతోనే రెచ్చిపోతున్నారని లక్ష్మీ ఆరోపణ..
◆ టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు..
ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవి లత..
అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోహణంలు..
◆ ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి..
ప్రజల తరఫున పోరాటం చేస్తామన్న ఎమ్మెల్సీ కల్పిత..
◆ భక్తజన కేంద్రంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ.. పుణ్యస్నానాలు ఆచరించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్..
◆ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన డికే అరుణ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ..
◆ మోడీపై మాట్లాడితే గొప్ప వాలం అవుతం అనుకుటున్నారు..
సీఎం రేవంత్ రెడ్డి పై బిజెపి ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు..
◆ ఇవ్వాలి ఇవాళతో ముగియనున్న మస్తాన్ సాయి కస్టడీ..
కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు..
◆ నారాయణపేట జిల్లా మక్తల్ లో ఘరానా మోసం షేర్ మార్కెట్ పేరిట 100 కోట్లు దండుకున్న సేటుగాడు.. నెల్లూరు జిల్లా కావలిలో పట్టుబడ్డ సుభాని..
◆ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఆక్రమణల కూల్చివేత.. అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన జిహెచ్ఎంసి అధికారులు..
◆ ప్రకాశం జిల్లా కంభం లో దారుణం.. కొడుకును ముక్కలుగా నరికి చంపిన తల్లి.. సంచుల్లో పెట్టి కాలువలో పడేసిన సాలమ్మ..
◆ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం.. కాంటాక్ట్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. న్యాయం చేయాలంటూ స్థానికులు రోడ్డుపై ఆందోళన..
◆ అల్లూరి జిల్లా వేలువాయిలో గిరిజనుల నివాసాలు కూల్చివేత.. పట్టా భూముల్ని ఆక్రమించారని నిర్మాణాలకు తొలగింపు.. ◆తమిళనాడులో ఈనెల 28న ప్రధాని మోడీ పర్యటన.. రామేశ్వరంలోని న్యూ పోమ్బన్ బ్రిడ్జ్ కు ప్రారంభోత్సవం..
◆ యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న బొలెరో వాహనం పదిమంది మృతి.. మహాకుంభమేళాకు వెళ్తుండగా ఘటన..
◆ యూపీ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపతి మురుమన్  దిగ్బ్రాంతి.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన రాష్ట్రపతి..
◆అక్రమ వలసదారులపై అమెరికా కొరడా.. మరో 119 మంది భారతీయుల తరలింపు..
◆ వలస విమానాలు పంజాబ్లో ల్యాండింగ్ పై వివాదం.. భారత్ పరువు తీస్తున్నారు అన్న సీఎం భగవంత్ మాన్..
◆ డాలర్ విలువను తగ్గించాలని చూస్తే 100% ట్యరీప్.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక..
◆ బంగారం ప్రియులకు భారీ ఊరట.. 10 గ్రాముల పై 1100 రూపాయల తగ్గుదల..
◆ 2007 తర్వాత తొలిసారి లాభాలలో బిఎస్ఎన్ఎల్ క్యూ3 లో 262 కోట్లు లాభాలు..

Continue Reading

News

విద్యార్థులకు అవగాహన సదస్సు

Published

on

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ స్వచ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా ఫిబ్రవరి మూడో శనివారం రోజు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అక్షర శ్రీ స్కూల్,  ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త హానికారి చెత్త వేరు చేయడం పై మున్సిపల్ కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలు శుభ్రత వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు,  రంజల రోడ్డు పలుచోట్ల మున్సిపల్ కమిషన శానిటేషన్ పనులను పర్యవేక్షించరు.

అవగాహన సదస్సులో పాల్గొన్న అక్షర శ్రీ స్కూల్ విద్యార్థులు
బాలికల వసతి గృహంలో మాట్లాడుతున్న కమిషనర్
తడి చెత్త పొడి చెత్త ఎలా వేరు చేయాలో తెలుపుతున్న కమిషనర్
Continue Reading

Trending