News
భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసుల
కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం జాతీయ రహదారి మాసోస్తవాల సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోట్ల సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, పిసిఆర్, ఆర్ట్స్ కాలేజీ, బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ , ఆర్టీసీ బస్టాండ్ మొదలగు సర్కిల్ డీఎస్పీ హేమలత, పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు “జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆదోని సబ్ డివిజన్ పోలీసు సిబ్బందితో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి విలువైనది మన ప్రాణము అని, ఆ ప్రాణాన్ని మనము కాపాడుకోవడానికి తప్పనిసరిగా టు వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్స్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ మరియు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని మరియు వేగం కన్నా ప్రాణం మిన్న అని వాహనాలు నడిపేటప్పుడు ఇంటిదగ్గర మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుంటారని, వాళ్లకు మనమే ఆధారం అని గుర్తించుకొని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా నివారించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

ఈ ర్యాలీలో ట్రాఫిక్ సిఐ, టూ టౌన్, 3 టౌన్, రూరల్ సిఐలు, ఎస్సైలు, ఆదోని సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




