News
విమానయాన శాఖ మంత్రి ముందు ఆదోని సమస్యల చిట్టా..
ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదోనిలో టిడిపి కార్యకర్తలకు జరుగుతున్న అవమానం, అన్యాయం గురించి మంగళగిరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఫిర్యాదు చేశారు మైనార్టీ పరిరక్షణ సమితి యం.హెచ్.పి.యస్.రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్.
ఆదోని ప్రాంతము కరువు, వలసల వల్ల బీహార్ కంటే బాగా వెనుకబడిన ప్రాంతముగా తయారైందని ఆదోని ప్రజల పట్ల దయాచూపి ఆదోని డివిజన్ ను ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని అభివృద్ధి కోసం ఏమేమి చేయొచ్చని మంత్రి ప్రశ్నించరని పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఆదోని అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ఆ దిశగా ప్రభుత్వం పని చేయాలని నూర్ అహ్మద్ సూచించామని తెలిపారు. అన్ని విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకొన్న మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో మాట్లాడి ఖచ్చితంగా ఆదోనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అదేవిధంగా ఆదోని టిడిపి పార్టీ కార్యకర్తలు చాలా మంచివారు, అంకితభావంతో పని చేసే ఇలాంటి కార్యకర్తలను దూరం చేసుకోవద్దని,ఆదోనిలో గత పదేళ్లు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే చేతిలో నలిగిపోయారని, ప్రస్తుతం కూటమి ఓట్లతో గెలిచిన బిజెపి ఎమ్మెల్యే పార్థసారధి వైసిపి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని వారికే మరలా పనులు ఆదాయ మార్గాలు చూపుతుండడంతో టిడిపి కార్యకర్తలు వరుసగా పదకొండవ సంవత్సరము కూడా ఇబ్బందులు తెలిపారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినా ఆదోని నియోజకవర్గం లో మాత్రం వైసిపి నాయకులదే హవా నడుస్తుందని వైసిపి నుంచి బిజెపిలో చేరిన నాయకులు కొందరు అరాచకాలు సృష్టిస్తూ ఆదోని అభివృద్ధిని అడ్డుపడుతున్నారని. అక్రమ దందాలకు పాల్పడుతున్నారని కాని వారిపై విచారణ జరిపి శిక్షించాలని కేంద్ర మంత్రిని కింజరాపు రామ్మోహన్ నాయుడు ని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశామన్నారు.
దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మాజీ వైకాపా నాయకుల అరాచకాలు అడ్డుకట్ట వేస్తామని, టిడిపి రాష్ట్ర అధ్యక్షునితో విచారణ జరిపించి టిడిపి కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఆదోని టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, సంతేకుడ్లూరు గ్రామ ఎమ్ .హెచ్ పి.యస్. అధ్యక్షులు సద్దాం హుస్సేన్, గౌరవ సలహాదారు కుబేర స్వామి , షేక్షావలి టిడిపి కార్యకర్తలు తుంబళం మల్లికార్జున మరియు జడే కేశప్ప పాల్గొనినట్లు తెలిపారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
