News
భూమాఫియా పాత్రధారులు దొరికారు మరి సూత్రధారులు ఎక్కడ?

ఆదోని భూమాఫియా పాత్రదారులు సరే! సూత్రదారులను ఎప్పుడు పట్టుకుంటారు? అని ప్రశ్నించారు MHPS మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్..
కర్నూలు జిల్లా ఆదోని లో భూమాఫియా చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ లపై ఘాటుగా స్పందించారు MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాత్రధారుల తీగలాగి సూత్రధారుల డొంక కదిలించాలని పోలీస్ అధికారులను కోరారు. భూమాఫియా చేస్తున్న అరాచకాల వల్ల ఆదోనికి చెడ్డ పేరు రావడంతో పాటు వ్యాపారంలో కొన్ని వందల కోట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ మాఫియా వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టము కలిగిస్తోందని ప్రభుత్వం దీన్ని ఆషామాషగా తీసుకోకుండా ఆదోనిలో జరిగిన 40 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్ కు యత్నించిన నేరస్తులను కఠినంగా శిక్షపడేలా విచారించి వారి కాల్ డేటా మరియు ఇతర వివరాలతో ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా కటకటాల వెనక్కి పంపాలని పోలీస్ శాఖను, ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. అలా చేయకపోతే ఆదోని మార్కెట్ కోలుకోవడం కష్టమని ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను భారీగా దెబ్బతీస్తుందని తెలిపారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 05-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 24116 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23655 క్యూసెక్కులు
News
కర్రతో దాడి తలకు తీవ్ర గాయం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో ఉసేని అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉసేని తెలిపిన వివరాల మేరకు గ్రామంలో ఘర్షణ పడుతున్నరని చూడడానికి వెళ్ళిన తనపై కర్రతో దాడి చేశారని ఈ ఘర్షణకు తనకు ఎటువంటి సంబంధం లేకున్నా తనపై దాడి చేశారని తెలిపారు.
News
ఆర్ అండ్ బి రోడ్లు బాగు చేయండి.. సిపిఎం పార్టీ డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2025 జనవరి (సంక్రాంతి) నాటికి గుంతలు లేని రోడ్లు ఉంటాయని చెప్పినట్లు గుర్తుచేశారు . కానీ ఆగస్టు నెల వచ్చిన ఒక్క గుంతను కూడా పూడ్చలేదని కావున ప్రభుత్వం తక్షణమే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ గుంతలు పూడ్చాలని కోరారు.
ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి సిరుగుప్ప క్రాస్ వరకు మరియు బైచిగేరి క్రాస్ నుండి కపటి గ్రామం వరకు, ధనాపురం నుండి నాగనాతనహాళ్ళి వరకు వయా హోళగుంద వరకు రోడ్లు పూర్తి గుంతల మయమై వాహనాలు ప్రయాణికులు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రోడ్లను బాగు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని మండలం పాండవగల్ దగ్గర నుండి కుప్పగల్ క్రాస్ వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి అడుగు నుండి రెండు అడుగుల వరకు కోతకు గురై వాహనాలు సైడ్ కు తీసుకోలేని పరిస్థితి ఉందని, ప్రస్తుతం శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు సందర్భంగా తీవ్రమైన రద్దీ పెరిగిందని దీనివలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రోడ్డుకి ఇరువైపులా గర్ల్స్ వేసి ప్రమాదాల బారి నుండి కాపాడాలని కోరారు. సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, ఎం. ఉచ్చిరప్ప, జే రామాంజనేయులు, మండల కమిటీ సభ్యులు భాష, అయ్యప్ప, పాండురంగ, హనుమంత్ రెడ్డి, మునిస్వామి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
-
News4 weeks ago
అత్యాచారం కేసులో ముద్దాయి అరెస్ట్
-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 07-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-07-2025
-
News1 day ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత