News
కబ్జాలకు పాల్పడితే తాట తీస్తా అన్న ఎమ్మెల్యే ఎక్కడ?

కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి అండగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం కూటమి ఎమ్మెల్యే సన్నిహితుడు నకిలీ ఆధార్ కార్డుతో స్థలాన్ని కబ్జా చేసిన విషయం గుర్తు చేశారు. ప్రస్తుతం బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి కోట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓటమి నాయకులే కొత్త వ్యక్తులతో ఈ పని చేయించారని ఆరోపించారు. ఆదోని ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదని బాధితులకు వైసిపి పార్టీ అండగా నిలబడుతుందని ఎవరు భయపడవద్దని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు. అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు పరచాలని లేకపోతే సబ్ రిజిస్టర్ కార్యలయం ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బతికున్న వ్యక్తిని మృతి చెంది నట్లు నకిలీ పత్రాలు సృష్టించిన వారిని కఠినంగా శిక్షించే వరకు పోరాడుతంఅని తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆస్తులు ఉన్నవారు వారానికి ఒకసారి అయినా ఆన్లైన్లో చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందిని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో మార్పు తేస్తా అన్న ఎమ్మెల్యే నకిలీ ఆధార్ కార్డు నకిలీ డెత్ సర్టిఫికెట్లు నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఎలా తయారు చేయాలి వాటిని వాడి స్థలాలను ఎలా కబ్జాలు చేయాలని నేర్పిస్తున్నారు మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కబ్జాలకు పాలు పడితే తాట తీస్తా అన్న ఎమ్మెల్యే ఎక్కడున్నావ్ అని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 06-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 23788 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23430 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 05 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 05-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 24116 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23655 క్యూసెక్కులు
-
News4 weeks ago
అత్యాచారం కేసులో ముద్దాయి అరెస్ట్
-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 07-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-07-2025
-
News2 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత