Connect with us

News

సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి.. సిపిఎం

Published

on

అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావి, శంకర్ నగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమం నిర్వహించరు. అనంతరం ప్రజాపోరు పోస్టర్స్ విడుదల చేశారు.

పోస్టల్ విడుదల చేసిన సిపిఎం నాయకులు

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, ముక్కన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం దారుణమని వారు తెలిపారు. అన్నిటికంటే ముఖ్యమైన పిల్లల చదువుకు సంబంధించి తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు ₹1500, రైతు భరోసా క్రింద 20వేల రుపాయాలు తదితర పథకాలు నేటికీ అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. మెగా డీఎస్సీ నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు అందని ద్రాక్షాగా  మారిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు వీరేష్, నాగేంద్ర, నాగరాజు, మల్లయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

విమానయాన శాఖ మంత్రి ముందు ఆదోని సమస్యల చిట్టా..

Published

on

ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదోనిలో టిడిపి కార్యకర్తలకు  జరుగుతున్న అవమానం, అన్యాయం గురించి మంగళగిరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఫిర్యాదు చేశారు మైనార్టీ పరిరక్షణ సమితి యం.హెచ్.పి.యస్.రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్.
ఆదోని ప్రాంతము కరువు, వలసల వల్ల బీహార్ కంటే బాగా వెనుకబడిన ప్రాంతముగా తయారైందని  ఆదోని ప్రజల పట్ల దయాచూపి ఆదోని డివిజన్ ను ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని అభివృద్ధి కోసం ఏమేమి చేయొచ్చని మంత్రి ప్రశ్నించరని  పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఆదోని అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ఆ దిశగా ప్రభుత్వం పని చేయాలని నూర్ అహ్మద్ సూచించామని తెలిపారు. అన్ని విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకొన్న మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో మాట్లాడి ఖచ్చితంగా ఆదోనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మంత్రికి వినతి పత్రం అందజేస్తున్న నూరు అహ్మద్

అదేవిధంగా ఆదోని టిడిపి పార్టీ కార్యకర్తలు చాలా మంచివారు, అంకితభావంతో పని చేసే  ఇలాంటి కార్యకర్తలను దూరం చేసుకోవద్దని,ఆదోనిలో గత పదేళ్లు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే చేతిలో నలిగిపోయారని, ప్రస్తుతం కూటమి ఓట్లతో గెలిచిన  బిజెపి ఎమ్మెల్యే పార్థసారధి వైసిపి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని వారికే మరలా పనులు  ఆదాయ మార్గాలు చూపుతుండడంతో టిడిపి కార్యకర్తలు వరుసగా పదకొండవ సంవత్సరము కూడా ఇబ్బందులు తెలిపారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినా  ఆదోని నియోజకవర్గం లో మాత్రం వైసిపి నాయకులదే హవా నడుస్తుందని వైసిపి  నుంచి బిజెపిలో చేరిన నాయకులు కొందరు అరాచకాలు సృష్టిస్తూ ఆదోని అభివృద్ధిని అడ్డుపడుతున్నారని. అక్రమ దందాలకు పాల్పడుతున్నారని కాని వారిపై విచారణ జరిపి శిక్షించాలని కేంద్ర మంత్రిని కింజరాపు రామ్మోహన్ నాయుడు ని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశామన్నారు.
దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మాజీ వైకాపా నాయకుల అరాచకాలు అడ్డుకట్ట వేస్తామని, టిడిపి రాష్ట్ర అధ్యక్షునితో విచారణ జరిపించి టిడిపి కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఆదోని టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, సంతేకుడ్లూరు గ్రామ ఎమ్ .హెచ్ పి.యస్. అధ్యక్షులు సద్దాం హుస్సేన్,  గౌరవ సలహాదారు కుబేర స్వామి , షేక్షావలి టిడిపి కార్యకర్తలు తుంబళం మల్లికార్జున మరియు జడే కేశప్ప పాల్గొనినట్లు తెలిపారు.

మంత్రికి సమస్యలను వివరిస్తున్న నూర్ అహ్మద్
Continue Reading

News

విద్యార్థుల కోసం సమయానికి బస్సులు నడపండి

Published

on

కర్నూలు జిల్లా..
పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరోద్వాజ్ DSF విద్యార్థి సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోడానికి వస్తున్నా విద్యార్థులకు సమయానికి బస్సు రావడం లేదని విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సమయానికి బస్సు నడపాలని అధికారులను కోరారు. ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సరైన సమయానికి బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే  పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

సబ్ కలెక్టర్ తో మాట్లాడుతున్న డి ఎస్ ఎస్ విద్యార్థి సంఘం నాయకులు
Continue Reading

News

ఓవర్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్యాయత్నం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కల్లుబావి వీధికి చెందిన రంగస్వామి అనే మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం పాత ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఎగిరి ఆత్మీయతయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు బంధువులు వన్ టౌన్ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రంగస్వామికి మతిస్థిమితం లేదని, ఆయన భవన నిర్మాణం కార్మికుడని తెలిపారు. ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లాడని బ్రిడ్జిపై నుంచి ఎగిరి కిందికి పడ్డాడని తెలిపారు. వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రిఫర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యయత్నంకు పాల్పడిన రంగస్వామి
Continue Reading

Trending