దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తిరిగిరాని లోకాలకు చేరుకోగా, మరో ఆరుగురు ఆసుపత్రి లో మృత్యువుతో పోరాడుతున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో రెండు ఆటోలు డీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో అరు మందికి తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు జి.జి.హెచ్ కు తరలించారు. మృతులు బళ్ళారి, చిత్రదుర్గా చెందిన రత్నబాయి , విసన్న గా గుర్తింపు పోలీసులు గుర్తించారు.
కార్తీక మాసం సందర్భంగా ఊరుకుంద క్షేత్రంలో వెలసిన నరసింహ స్వామి నీ దర్శించు కోవడానికి ఆదోని నుండి ఆటో లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వచ్చిన ఆటో బలంగా ఢీ కొనడంతో కర్ణాటక చిత్రద్దుర్గ కు చెందిన వీసన్న (50) , బళ్ళారి కి చెందిన రత్నాబాయి (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా రత్నబాయి కుమారుడు మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరినీ కర్నూలు జిజిహెచ్ కు తరలించగా తీవ్ర గాయాలైన ఆరు మంది ఆదోని జిజిహెచ్ లో చికిత్స అందిస్తున్నారు