కర్నూలు జిల్లా: వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఆదోని మండలం సదాపురం గ్రామం వద్ద ఉదయం అంజి (50) అనే వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆదోని జిజిహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంజి మృతి చెందాడు.
కోసిగి సమీపంలో అదే గ్రామానికి చెందిన ఆంజనేయ (20 సం) అనే యువకుడు స్కూటర్ అదుపుతప్పి క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ లో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పెద్ద తుంబలం మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.