News
బెంగళూరులో జాతీయ అవార్డు అందుకున్న ఆదోని శ్రీనివాస్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బి. శ్రీనివాస్ సోమవారం బెంగళూరులో సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవ పురస్కారం మేమెంటో లతో పాటు ప్రశంసా పత్రని అందుకున్నారు.
బెంగళూరులో అంబేద్కర్ హాల్లో జరిగిన సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ వారు నిర్వహించిన జాతీయ సేవ పురస్కారం కార్యక్రమనికి దేశవ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, చత్తీస్గడ్, ఒడిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మరియ వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని ఎంపిక చేసి కర్ణాటక ప్రముఖుల చేత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవ పురస్కారం సన్మాన సభ నిర్వహించారు. ఎంపిక చేసి వారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించి జాతీయ సేవ పురస్కారం మేమెంటో లతో పాటు ప్రశంసా పత్రలను అందజేశారు.
సామాజికవేత్త బి శ్రీనివాస్ మాట్లాడుతూ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ నిర్వహిస్తున్న సన్మాన కార్యక్రమం మరువలేనిదని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 13 వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సామాజికవేత్తలను ఎంచుకొని సన్మానం చేయడం చాలా గర్వకారణం అన్నారు. ఏడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా మరియు రాష్ట్ర మీడియా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తూ ఆయా పాఠశాలలో మౌలిక వసతులు ఉన్నాయా లేదా అనే దానిపై పాఠశాల ను సందర్శించి విద్యార్థిని విద్యార్థినిలకు మెరుగైన సేవలు అందించినందుకు కర్నూలు జిల్లా నుండి ఎంపిక చేసిన సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ నిర్వాహకులు రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవ పురస్కారం ద్వారా మరింత బాధ్యతలు పెంచి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని బి శ్రీనివాసులు తెలిపారు.

News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 38772 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38618 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 10 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 08 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


-
News6 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News4 days ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
News4 days ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News6 days ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News6 days ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన
-
News6 days ago
కర్రతో దాడి తలకు తీవ్ర గాయం
-
Business3 weeks ago
Gold, Silver Price బంగారు ధర