కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దాడికి గురైన దళిత మహిళ గోవిందమ్మను ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మరియు ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ తదితరులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గోవిందమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మాట్లాడుతూ ప్రేమవివాహం కారణంగా అబ్బాయి తల్లిని, అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు గ్రామంలో ఉంటున్న గోవిందమ్మను ఈడ్చుకెల్లి వివస్త్రను చేసి స్థంభానికి కట్టేసి కొట్టి హింసించడం అనేది చాలా దారుణం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది మానవ సమాజానికి సిగ్గుచేటు అని తెలిపారు. ఈ విషయంలో మన రాష్ట్ర హోంమంత్రి ఒక దళిత మహిళ కాబట్టి వెంటనే స్పందించాలని కోరారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళితులపై దాడులు ల్ పునరావృతం కాకుండా చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. దళిత మహిళ పై దాడికి పాల్పడిన ముద్దాయిలకు శిక్షలు పడేంతవరకు పోరాడుతామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ, వీరేశ్, మాల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నరు.