News
నకిలీ కులదృవీకరణ పత్రంలను అందించిన అధికారులపై చర్యలు తీసుకోండి
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవి కుమార్ కర్నూల్ జిల్లా మెంబర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ రాజు, ఎరుకలక్కల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మంత్రాలయం అధ్యక్షుడు బజారి, హనుమేష్ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కౌతాళం తహశీల్దార్ కె. మల్లిఖార్జున స్వామి, కౌతాళం డిప్యూటీ తహశీల్దార్ ఎస్.ఐ. వీరేంద్ర గౌడ్, బదినేహాళు గ్రామానికి సంబంధించిన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, బదినేహాళు గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సూర్య నారాయణ రెడ్డి కలిసి SC కమ్యూనిటీలోని మాదిగ కులానికి చెందిన నలగోడీ శ్రీనివాసులు అనే పేరుగల సెకండ్ గ్రేడ్ టీచర్ కు ST ఎరుకల కులదృవీకరణ పత్రం మంజూరు చేశారనె ఆరోపణలతో వీరిపై FIR 83/2024 u/s 61(2),336(3),318(4) BNS at Kurnool – Kowthalam PS of Kurnool Dist. నందు కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేసి వీరిని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు వినతిపత్రాన్ని అందజేశామని తెలిపారు.
సబ్ కలెక్టర్ కు వీరు అందించిన వినతిపత్రం పూర్తి వివరాలు ఇలాఉన్నాయి..
బదినేహాళు గ్రామానికి చెందిన VRO, RI లతో పాటు కౌతాళం డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్ ద్వారా ఫాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ను, ఫాల్స్ ఇన్కమ్ సర్టిఫికెట్ ను పొందిన నల్లగోడి శ్రీనివాసులు స్వగ్రామం కల్లూరు మండల పరిధిలోని పెద్దపాడు గ్రామం కాగా కర్నూలు నగరంలోని ధర్మ పేటలో ఉన్న ఇంటి నెంబర్ 40 – 707 లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగోడి శ్రీనివాసులు ఎస్టీ కమ్యూనిటీకి చెందిన ఎరుకల కుల ధృవీకరణ ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ ను నంద్యాల మండల రెవెన్యూ అధికారి కార్యాలయం పేరుతో తయారు చేసుకుని, దానిని సమర్పించి డీఎస్సీ – 2000 లో సెకండ్ గ్రేడ్ టీచర్ ఉద్యోగం పొందారు. ఆ ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ సహాయంతో డీఎస్సీ – 2000 వ్యవహారాలను చూసిన అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ , కర్నూలు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి మోసం చేసి అక్రమంగా, తప్పుడు పద్ధతిలో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారని ఈ విషయం పైన విద్యాశాఖ అధికారులకు వీరితో పాటు మరి కొందరు ఫిర్యాదులు చేశారని తెలిపారు. నల్లగోడి శ్రీనివాసులు తన ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ పైన ఉన్న ఫిర్యాదుల నుంచి బయట పడటం కోసం, ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, ఆదోని పేరుతో పదో తరగతి కి సంబంధించిన ఫేక్ మార్కుల జాబితాను, ఫేక్ బదిలీ సర్టిఫికెట్ ను, ఫేక్ స్టడీ సర్టిఫికెట్ ను తయారు చూశారని ఆరోపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండల పరిధిలోని సంజీవరాయుని పేటకు చెందిన శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాల పేరుతో ఇంటర్మీడియట్ కోర్సుకు సంబంధించిన ఫేక్ మార్కుల జాబితాను తయారు చేసుకొని. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి చెందిన జె. సి. నాగిరెడ్డి డిగ్రీ కళాశాలల పేరుతో డిగ్రీ కోర్సుకు చెందిన ఫేక్ సర్టిఫికెట్స్ ను, ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసుకున్నారని. పైన చెప్పిన వాటి వివరాలను కౌతాళం తహశీల్దార్ కె. మల్లిఖార్జున స్వామి కర్నూలు కలెక్టర్, కౌతాళం సర్కిల్ ఇన్స్పెక్టర్ కి గత నెల 27 వ తేదీ అందించిన ఫిర్యాదుల్లో స్పష్టంగా తెలియజేశామని అన్నారు. నైతిక విలువలతో కూడి ఉండాల్సిన ఉపాధ్యాయుడిగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చే విధంగా విద్యార్హతలకు సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్స్ ను, ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖను, రెవెన్యూ శాఖను పనిగట్టుకుని మోసం చేసిన నల్లగోడి శ్రీనివాసులు పైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
తప్పు చేసిన ఇతని పై ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ పైన విచారణ అధికారిగా పనిచేసిన నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ ఆదోని హెడ్ మాస్టర్ హలీం సిద్ధిఖీ విచారణను పూర్తి చేసి 28-08-2024 వ తేదీన విచారణ నివేదికను కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారికి అందజేశారు. ఆ నివేదికను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




