టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం
కర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తో కలిసి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (NRDC) దక్షిణ విభాగం అయిన డాక్టర్ B.K. సాహు, టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా వ్యవస్థాపక మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ M. సతీష్ బాబు, శిక్షణా భాగస్వామి జ్యోతి కనుమూరి హాజరయ్యారు.

వీడియో ద్వారా విద్యార్థులకు తెలుపుతున్న ఫోటో

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులకు ఇంటన్షిప్ లో భాగంగా ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లో ఆదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో 23-24 సంవత్సరం బ్యాచ్లోని 471 మంది విద్యార్ధులు 11రకాల కోర్సుల్లో నైపుణ్యం పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మేమేంటోస్ అందజేశారు.

డాక్టర్ B.K. సాహుకు మేమంటూ అందజేస్తున్న ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యం

సమావేశంలో పలుగోన్న ప్రతినిధులు మాట్లాడుతూ టెక్- మార్క్ ప్రధాన లక్ష్యం విద్యార్ధులలో ఉపాధి అవకాశాలను పెంచడం, ఉత్తమ ప్రతిభావంతమైన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమని తెలిపారు. టెక్-మార్క్ వివిధ విద్యా సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మరియు ఆంట్రప్రెన్యూర్పిప్ డెవలప్మెంట్ సెంటర్లను ఎర్పాటు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాంమని తెలిపారు. గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాలలో చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి MSME సహకారంతో ముందుకు వెళుతామని తెలిపారు.

సతీష్ బాబుకు మేమంటూ అందజేస్తున్న ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యం

ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అధ్యక్షులు విట్టా సతీష్ కుమార్, కార్యదర్శి మరియు కరెస్పాండెంట్ దైవధీనం రెడ్డి, ప్రిన్సిపల్ మురళీ మోహన్ పాలుగొన్నారు.

మెమొంటోళ్లు అందజేస్తున్న సాహూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *