News
నిలబడిన ఆటోను ఢీకొన్న ఆటో
కర్నూలు జిల్లా ఆదోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో నిలబడిన ఆటోను వెనక నుంచి ఆటో ఢీకొనడంతో మదిరే గ్రామానికి చెందిన చంద్రన్న (60) కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మదిరె గ్రామం నుంచి పని నిమిత్త ఆటోలు వెనక డోర్ పై కూర్చుని ఆదోని కి వస్తుండగా కొత్త బ్రిడ్జి సమీపంలో ఆటో ముందు ఉన్న కారు నిలబడటంతో ఆటోను నిలబెటరు. వెనక వస్తున్న ఆటో ఢీకొనడంతో చంద్రన్న కాళు కు తీవ్ర గాయం అయిందని బంధువులు తెలిపారు.
News
మట్కా నిర్వాహకులు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పరిధిలో అక్రమంగా మట్కా నిర్వహిస్తున్న నలుగురు మున్షిఅలీ హుస్సేన్, కే. ఈరప్ప వైస్ శ్రీకాంత్ రెడ్డి, షేక్ చకోలి చాంద్ బాషాను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 51 వేల 600 రూపాయలు నగదు, 25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నరు. నలుగు ముద్దాయిలను త్రీ టౌన్ పోలీసులు డిఎస్పి సోమన్న ముందు హాజరు పరిచి రిమైండ్ కి తరలించారు.
News
ఆటో బోల్తా పడి మహిళ మృతి
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వస్తున్న స్కూటర్ ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్ళారికి చెందిన మహంకాళమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. బంధువులు తెలిపిన వివరాల మేరకు తారపురం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
News
ఏపీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్
■ ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం : ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు..
■ ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది..
ఏపీఎస్ ఆర్టీసీలో 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఛైర్మన్‌గా సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి నవంబరు 21న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఉద్యోగాల భర్తీపై సమాచారాన్ని వెల్లడించారు. అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా విద్యుత్తు బస్సులు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. అందిన సమచారాం మేరకు ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీలపై వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు చూస్తే.. డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ పోస్టులు 1,813, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280 వరకు ఉన్నాయి.
-
Business5 days ago
Gold, Silver Price బంగారు వెండి ధరలు
-
News3 days ago
పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి
-
News3 weeks ago
దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
-
News1 week ago
ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి
-
News5 days ago
కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
-
News1 week ago
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన
-
News4 days ago
13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
-
News5 days ago
మురికి కాలువలో మృతదేహం