Connect with us

News

క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7  మంది  బెట్టింగ్ రాయుల్లను సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 91 లక్షల  నగదు స్వాధీనం, 7 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు.

క్రికెట్ బెట్టింగ్ లో పట్టుకున్న నగదు

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ ను ఆన్ లైన్ లో ఆడుతూ, బెట్టింగ్ కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మరీ, ఆ అప్పులు తీర్చలేకఇంట్లో తల్లితండ్రులకు చెప్పుకోలేక , తమ భవిష్యత్తు పై వారి తల్లి తండ్రులు పెట్టుకున్న ఆశలను అడియశలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుచున్నాయని బెట్టింగ్ ను ఎలాగైనా అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి M. హేమలత పర్యవేక్షణ లో ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ మరియు వారి సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 18.05.2025 వ తేదీన సాయంత్రం 03.30 గంటలకు వాల్మీకి నగర్ లోని వాల్మీకి గుడి కి ఎదురుగా మొబైల్ ఫోన్ లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్. ఆర్.నాగరాజును అదుపులోనికి తీసుకోగా మిగిలిన ముద్దాయులు పారిపోయారు. అతని నుండీ నగదు 50,000 వేల రూపాయలను స్వాదీన పరచుకుని ఆదోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఏపీ గేమింగ్ యాక్ట్ ( క్రికెట్ బెట్టింగ్ ) క్రింద కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. 

రివార్డులు అందజేస్తున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
రివార్డులు అందజేస్తున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
రివార్డులు అందజేస్తున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

టెక్నాలజీ ఆధారంగా దొరికిన సమాచారం మేరకు సిఐ శ్రీ రామ్ కర్నూలు, హైదరాబాదు, ఒంగోలు, చిలకలూరు పేట, బెంగళూరు సిటిలో పూర్తి సమాచారాన్ని తెలుసుకొని 30.05.2025వ తేదీన మద్యాహ్నం 11.30 గంటలకు ఆదోని టౌన్ లోని ఎల్లమ్మ కొండ లోని మర్రి చెట్టు దగ్గర 7 మంది
1. ఆదోని పట్టణం మసీదుపుర కు చెందిన ఇస్మాయిల్ @ ఇస్మాయిల్, వయసు 44 సం. లు
2. ఆదోని పట్టణం బోయగిరికి చెందిన బోయ మహానంది వయసు 55   సం. లు,
3. ఆదోని పట్టణం మరాఠి వీధికి చెందిన బోయ రమేశ్, వయసు 26 సం. లు,
4. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీకి చెందిన చిక్కబళ్లాపూర్ వాసి రాజేష్, వయసు 38  సం. లు,
5. ఒంగోలు జిల్లా జరుగుమల్లి మండలం, ఎద్దులూరిపాడు గ్రామనికి చెందిన చుండి శ్రీనివాస రావు @ నాయుడు, వయసు 48 సం .లు, 
6. ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ సత్యనారాయణపురం కు చెందిన అడ్డాల కల్యాణ్, వయసు 33 సం,
7. హైదరాబాద్ కు చెందిన రఘు ఆచారి
ఏడు మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 07 మొబైల్ ఫోన్ లు 91,00,000 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు.
వీరు ఆడుతున్న క్రికెట్ బెట్టింగ్ యాప్స్
1. నేషనల్ ఎక్సేంజ్ 9
2. రాధే ఎక్సేంజ్ ,
3. వజ్రా ఎక్సేంజ్,
4. నేషనల్ 777,
5. మోర్ ఎక్సేంజ్

మీడియాతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన ఆదోని డిఎస్పీ హేమలతను , ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరామ్, ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మునిస్వామి, రంగస్వామి, ఏకవీర, ఫక్కీరప్ప, హుస్సేన్ భాషాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  ప్రత్యేకంగా అభినందించారు.

పూర్తి వీడియో చూడండి ఇక్కడ క్లిక్ చేయండి
ముద్దాయిలను మీడియాకు చూపిస్తున్న పోలీసులు
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

Published

on

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
  • ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
  • తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Published

on

ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలు:

​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

భారీగా ఊట ధ్వంసం:

​పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడి గుర్తింపు:

​పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending