News
కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు
కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ డీలర్ షాప్ లకై పరీక్ష పోటీలలో ఎంపికైన వారికే రేషన్ డీలర్ షాపులు కేటాయించాలి ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కూటమి నాయకులు రేషన్ డీలర్ షాపుల కోసం మాకిన్ని కావాలి మాకు ఇన్ని కావాలని గొడవ పడడం సరైన పద్ధతి కాదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పరీక్ష రాసి ఎంపికైన వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు బసాపురం లింగప్ప, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, ట్రేసర్ శేఖర్ నాయకులు రమేష్, భాష, లింగప్ప, వీరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

News
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

News
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
హోస్పేట: 13.07.0226:
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 13 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1602.0 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 24.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు:
- ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 17152 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 16807 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
- అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 652 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.23 అడుగులుగా ఉండగా.. 77524 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 38071 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
హోస్పేట: 12.07.0226:
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 12 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1601.08 అడుగులకు చేరుకుంది.మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 22.948 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు:
- ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 25,120 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 19,642 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
- అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 381 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
- ఎగువన ప్రవాహాలు: తుంగా రిజర్వాయర్ నుండి 6,621 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.13 అడుగులుగా ఉండగా.. 76.912 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 36.254 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
-
News1 week agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News7 days agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News1 week agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News3 weeks agoసూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
-
News5 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News3 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్‌లు స్వాధీనం
-
News2 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News4 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
