News
ఆదోని వెయిట్ & మెజర్మెంట్ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా అదోనిలో శనివారం తూనికలు మరియు కొలతల అధికారుల దాడులు నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ ప్రక్కన పెట్రోల్ బంక్ లో ఉన్న బాలాజీ వేయింగ్ బ్రిడ్జ్ లో 40కేజీల తేడా వస్తుందని నాన్ స్టాండర్డ్ క్రింద కేసునమోదు చేసామని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ కంట్రోల్ శ్రీరామ్ మాట్లాడుతూ తూకాలలో తేడాలు వస్తున్నాయని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి వేయింగ్ మిషన్లపై కూడా నిఘా ఉంచి దాడులు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా తూకాలు తేడా వస్తే తూనికల కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
పత్తి జిన్నిగ్ ఫ్యాక్టరీలలో వేయింగ్ మిషన్లు పెట్టి కొన్ని ఫ్యాక్టరీలో 50 కేజీల నుంచి 300 కేజీల వరకు రైతులను మోసం చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాటిపై నిఘా ఉంచి త్వరలో పట్టుకుంటామని అన్నారు. బయటవి ఉన్న వేయింగ్ మిషన్స్ కూడా ఫ్యాక్టరీలతో కుమ్మక్కై తూకాలు తేడా చేస్తున్నారని త్వరలో పూర్తి సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకుంటామని తెలిపారు.


News
స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని ఈడెన్ గార్డెన్ స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి ప్రిన్స్ (5) అనే బాలుడు మృతి చెందడం. తల్లి, తండ్రుల వెంట స్విమ్మింగ్ చేయడానికి వెళ్లిన ప్రిన్స్ అనే బాలుడు చిన్న పూల్ ల్ నుండి పెద్ద పూల్ లోనికి వెళ్లిన తల్లి తండ్రులు గమనించక పోవడంతో నీటిలో మునిగిన బాలుడు ఈత కొడుతూ నీటిలో మునిగి మృతి చెందడం. బాలుడి మృతదేహం ఈతగాళ్ల కాళ్లకు తగలడంతో బాలుడి మృతదేహాన్ని ఈతగాళ్లు బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఇతర్లించారు డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు.

News
కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న

కర్నూలు జిల్లా: కర్నూల్ రేంజ్, ఉమ్మడి కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల ఎసిబి నూతన డిఎస్పీగా దివిటి సోమన్న 30 04 2025 వతేది బాధ్యతలు స్వీకరించరు. ఎసిబి డిఎస్పీ సోమన్న
ఎసిబి సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు. శ్దివిటి సోమన్న స్వగ్రామం వేపకుంట గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా. 1991 లో ఎస్‌ఐ హోదాలో పోలీసు డిపార్ట్మెంట్ లో విధుల్లో నిర్వహించారు.
ఎస్‌ఐ గా క్రిష్ణగిరి, సంజామల, నందవరం, వెల్దుర్తి, పిటిసి అనంతపురం నందు ప్రమోషన్ పొందిన తరువాత సిఐ గా సిఐడిలో, ప్యాపిలి, ఆదోని తాలూకా, లక్కిరెడ్డిపల్లిలో పని చేసినారు. 2020 లో డిఎస్‌పిగా పదోన్నతి పొంది సిఐడి శాఖలో మరియు ఆదోని సబ్ డివిజన్ లో పని చేశారు.
News
కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం

పెహెల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని
కర్నూలు జిల్లా ఆదోని భీమాస్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించరు. కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ శత్రువులను కూడా క్షమించడమే మహమ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాంకు విరుద్ధమైన చర్య.దీన్ని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారు అన్నారు. ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలలు నరికి వేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఆదోని ముస్లిం జేఏసి అండగా నిలబడుతుందని మద్ధతు ప్రకటించారు. మతసామరస్యం, దేశసమగ్రత కోసం ఆదోని ముస్లిం జేఏసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
నాయకులు మహ్మద్ నూర్, సద్దాం హుస్సేన్, మన్సూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రవాదు దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని అదేవిధంగా నిందితులను కఠినాతి కఠినంగా బహిరంగ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంతాప సభలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సేవా సంఘాల నాయకులు కన్వీనర్ నూర్ అహ్మద్, కో కన్వీనర్ మహమ్మద్ నూర్ ,నాయకులు లాయర్ సద్దాం హుస్సేన్, వసీం సాహెబ్, అర్షద్, మన్సూర్ , ఇస్మాయిల్, కౌన్సిలర్ హాజీ, ఫారుఖ్, జీలాన్, షకీల్ మరియు ముస్లిం యువత పాల్గొన్నారు.
-
News2 weeks ago
అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం
-
News3 weeks ago
భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం
-
News2 weeks ago
అదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతి రేకంగా భారీ ర్యాలీ
-
News3 weeks ago
అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్
-
News2 weeks ago
పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం
-
News2 weeks ago
కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News1 week ago
కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న