News
అదోనిలో భారీగా వాహనాలు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని లో విజయనగర్ కాలనీ, కౌడల్ పేట, వాల్మీకి నగర్, బోయగిరి ఏరియాలలో రెండు రోజులుగా కార్డెన్ అండ్ సెర్చ్ ను నిర్వహించిన పోలీసులు. అందులో భాగంగా ఎటువంటి రికార్డ్స్ లేని 1 కారు, 6 ఆటోలు, 2 బొలెరో వాహనాలు, 76 మోటార్ సైకిలు 30 లీటర్స్ సారాయిని పోలీసులు సీజ్ చేశారు. కార్డెన్ అండ్ సెర్చ్ లో ఆదోని డీఎస్పీ శ్రీ J. శివ నారాయణస్వామి, ట్రైనింగ్ డిఎస్పి శ్రీధర్ ధీరజ్, వన్ టౌన్ సీఐ 2 టౌన్ సీఐ, త్రీటౌన్ సీఐ రూరల్ సీఐ మరియు సబ్ డివిజన్లోని ఎస్సైలు మరియు పోలీసులు పాలుగోన్నరు.


News
స్మార్ట్ మీటర్లు మరియు కరెంట్ చార్జీలు భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం సిపిఎం

రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికాలంలోనే ప్రజలపై సుమారు 18 వేల కోట్ల రూపాయల కు పైగా కరెంటు చార్జీల బారాలు వేసిందని, ఇది చాలదన్నట్లు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించి మరింత భారం మోపాలని చూస్తుందని ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని, ఉద్యమాలలో కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ గౌస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే. వెంకటేశులు పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లా అదోనిలో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ గత ఐదేళ్లలో వేసిన కరెంటు చార్జీల భారాన్ని ఒక్క సంవత్సరంలోనే కుటమి ప్రభుత్వం ప్రజలపై వేసిందని ఈ భారాలకు వ్యతిరేకంగా ఇప్పటికే తీవ్రమైన ఉద్యమాలు జరిగాయని భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుందని కార్యకర్తలు అందరూ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ క్లాసులో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి, ఎం. ఉచ్చిరప్ప, రామాంజనేయులు, మండల నాయకులు భాష, అయ్యప్ప, మునిస్వామి, పాండురంగ, తిక్కప్ప, హనుమంత్ రెడ్డి, అయ్యన్న, పాండవగల్ సర్పంచ్ కె. ఉమాదేవి, శాఖా కార్యదర్శులు నాగరాజు, విరుపాక్షి, పరమేష్, నరసమ్మ పార్టీ సభ్యులు మరియు సానుభూతిపరులు పాల్గొన్నారు.

News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.13 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 76.912 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 43736 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23399 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 03 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


-
News4 weeks ago
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 06-07-2025
-
News4 weeks ago
అత్యాచారం కేసులో ముద్దాయి అరెస్ట్
-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 05-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 07-07-2025
-
News4 weeks ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు