Connect with us

News

కుక్క దాడి 10 మందికి గాయాలు

Published

on

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో  10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మస్తాన్ షాప్
మస్తాన్ తెలిపిన వివరాలు

News

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో  నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు.

వినాయక కాటు వద్ద పరిశీలిస్తున్న అధికారులు

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో నిమజ్జన ఏర్పాట్లకు చేయాలని పోలీసులను విగ్రహాలు వెళ్లే దారిలో రోడ్లో ఉండే ప్యాచ్ వర్క్ ను తర్వాత గతిన పూర్తి చేయాలని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు, విగ్రహాల ఊరేగింపు సమయంలో  విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు ను అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఊరేగింపు జరిగే వీధుల్లో రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక, కంకర అడ్డు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పకడ్బందీ నియంత్రణ చేపట్టాలని పోలీసులకు సూచించారు. కెనాల్ దగ్గర గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులను, మెడికల్ క్యాంప్ ఏఆర్పాటు చేయాలని వైద్యాధికారులకు, నిమజ్జనం సమయంలో క్రేన్లు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉంచుకొని  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

అధికారులకు ఆదేశాలు ఇస్తున్న సబ్ కలెక్టర్


ఈ కార్యక్రమంలో డిఎస్పి హేమలత, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వినాయక ఘాటు వద్ద అధికారులతో సబ్ కలెక్టర్
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 28-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 19617 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 19412 క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 28 08 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 20/- రూపాయలు, రిటైల్: 1kg 22/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయలు

28 08 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

Trending