కర్నూలు జిల్లా ఆదోనిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షనికి రామజల చెరువు నిండి ప్రవహించడంతో చుట్టూ ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు. మొత్తం ఆదోని డివిజన్లో 722 మిల్లీమీటర్లు కురవగా ఒక ఆదోనిలో అత్యధిక వర్షపాతం 126.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు రావడంతో నిజాముద్దీన్ కాలనీ, తిరుమల నగర్, కార్వాన్ పేట, ఖునిమొహాళ్ల, గోఖర్జెండా జలమయమయ్యాయి. వంకలు పొంగి వరద నీరు పోటెతడంతో పంట పొలాలు నీట మునిగాయి.



