News
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకే క్రీడా పోటీలు
విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3160 గవర్నర్ మాణిక్ ఎస్ పవార్ అన్నారు.
కర్నూలు జిల్లా అదోని స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గ్రామాల నుండి 53 పాఠశాలల దాదాపు 2500 మంది విద్యార్థిని విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కాగడ చేత పట్టుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు కప్పులతో పాటు రోటరీ క్లబ్ సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ క్రీడా పోటీల్లో బాలుర జట్లు ఫుట్‌బాల్ లో 16 జట్లు, త్రో బాల్ 20 జట్లు, కబడ్డీ 33 జట్లు, డాడ్జ్ బాల్ 12 జట్లు , బాస్కెట్ బాల్ 5, అథ్లెటిక్స్ 41, గర్ల్స్ లో జట్లు, కోకో గర్ల్స్ 22 జట్లు, త్రో బాల్ 20 జట్లు, కబడ్డీ గర్ల్స్ 20 జట్లు, టెన్నికాయిట్ గర్ల్స్ 14జట్లు, అథ్లెటిక్స్ 40 జట్లు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ పోటీలను రోటరీ సభ్యుడు సాబీర్ అహ్మద్ సహాయ సహకారాలు మరియు 60 మంది వ్యాయామ ఉపాధ్యాయుల సహకారం ఎనలేని వని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ నాగరాజు, అసిస్టెంట్ గవర్నర్ భరత్ షా, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఉమేష్ పాయి, కార్యదర్శి నితీష్ గాంధీ, యూత్ ఆఫీసర్స్ అమిత్ గాంధీ, కొల్లి నితిన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరస్పాండెంట్ దైవదినం రెడ్డి, మల్లికార్జున విద్యాలయ కరస్పాండెంట్ సూగురప్ప రోటరీ క్లబ్ సభ్యులు జీవన్ సింగ్, సునీల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బసవరాజు, ప్రశాంత్ గాంధీ, రఘునాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, వికాస్ బండారి, రాయచోటి సుబ్బయ్య, వినోద్ జైన్, డాక్టర్ సైఫుల్ల, విట్టా రాజేష్, విజయ్ చౌదరి, ఇతేష్, వీరేష్ స్వామి, షణ్ముఖ, శివరాం, హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.

News
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


