News
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు అర్హులు ఉన్నారు అని ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని అర్హులైన వ్యక్తులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, స్థలాలను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటివరకు 1474 జాయింట్ ఎల్పిఎంలు గుర్తించగా, కేవలం 309 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. మిగిలిన దరఖాస్తులు జూన్ 30వ తేదీ లోపు పూర్తిచేయాలని తహశీల్దార్లకు ఆదేశించారు.

65 సంవత్సరాలు పైబడినవారికి మరియు దివ్యాంగులకు రేషన్ సరుకులను జూన్ 25 నుండి 30వ తేదీ లోపు డోర్ డెలివరీ చేయాలని పేర్కొన్నారు. డోర్ డెలివరీ ప్రక్రియలో ఎంతమందికి సరుకులు అందించామో, ఎంతమందికి అందించలేకపోయామో వివరాలు సమగ్రంగా ఇవ్వాలని అధికారులకు తెలిపారు. జూలై నెల రేషన్ సరుకుల పంపిణీ వంద శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
కౌలు రైతు కార్డులపై కూడా సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఆదోని డివిజన్లో 10,500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 1,100 కార్డులే నమోదు అయ్యాయని తెలిపారు. జూలై 15వ తేదీ లోపు రీన్యూవల్ మరియు కొత్త దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజును ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డివిజన్లోని తాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, గంగిరెడ్డి, ఆదోని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ వేణు సూర్య, శ్రీనివాసరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.38 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 74.486 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28902 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 2389 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 01 07 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 30 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు


-
News2 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News4 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News2 weeks ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News4 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News4 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ
-
News23 hours ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025
-
News4 weeks ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
-
News2 weeks ago
వీర జవాన్ కుటుంబానికి లక్ష ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే