News
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 40
News
పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిలిందంటూ ఫ్యాక్టరీ యాజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల పత్తి, 2 కోట్ల పత్తి బెల్లు (600 బెల్లు), సుమారు కోటి రూపాయల పత్తి సీడ్, మోటర్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి రెండు ఫైర్ ఇంజన్ తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతుల రెండు బొలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటుచేసుకుంద ని యాజమాని ప్రశాంత్ పేర్కొన్నారు.
News
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు గ్రామానికి నెలలో ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారని తాగునీటి సమస్య ఇప్పుడే తీవ్రంగా ఉంటె వేసవికాలంలో మరి తీవ్రం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కనీసం మూడు రోజుల కు ఒకసారి మంచినీళ్లు సరఫరా చేయాలనిడిమాండ్ చేసిన డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఉర్చీరప్ప
వ్యవసాయ కార్మిక సంఘం హుసేని కెవిపిఎస్ రామాంజిని.. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.
News
నాటు సారా తయారీ బట్టీల ద్వంశం ముద్దాయిలు అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెల్లమ్మ కొండలలో నాటు సారాయి తయారు చేస్తున్న నలుగురు ముద్దాయిలను A-1. బోయ సురేష్ (35), A-2. సంగ్రామ్ హబీబ్ బాష (45), A-3. బోయ అనిత (32), A-4. బోయ వెంకటేష్ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట ద్వంశం చేసినట్టు వన్ టౌన్ సిఐ తెలిపారు.
వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO సోమన్న వారి పర్యవేక్షణలో ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ వారి సిబ్బంది 16వ తేదీ గురువారం యెల్లమ్మ కొండలలో అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒక మహిళను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారు అయినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 30 లీటర్ల నాటు సారాయి ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదు ప్లాస్టిక్ డ్రమ్ములలో సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ద్వంశం చేసి కేసు నమోదు చేశామన్నారు. వారిని కోర్టుకు హాజరుపరచి రిమాండ్ కి తరలిస్తున్నట్లు సిఐ శ్రీరామ్ తెలిపారు.
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business5 days ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business6 days ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business7 days ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర