Day: October 25, 2024

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 25

ఆదోని 25 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయలు

మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్బంగా, అన్న క్యాంటీన్లో మూడు పుటలు, పేదలకు శ్రీనివాస్ ఆచారి ఆధ్వర్యంలో, భూపాల్ చౌదరి చేతులమీదుగా అన్నదానం చేశారు. అలాగే 19 వార్డు ఇంచార్జి శ్రీనివాస్ ఆచారి చేతులమీదుగా జీవనజ్యోతి ఆశ్రమంలో, వృద్దులకు అన్నదానం చేశారు.

ఆదోని డివిజన్ వ్యవసాయ అధికారుల శిక్షణ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ సహాయ సంచాలకులు వారి కార్యాలయంలో శుక్రవారం ఆదోని డివిజన్ పరిధిలోని  గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు విస్తరణ అధికారుల కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పత్తి, వేరుశనగ, శనగ పంటలలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రస్తుత పంటలలో ఎదుర్కొంటున్న తెగుళ్లు పురుగుల నివారణ చర్యలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , ఏరువాక కేంద్రం కర్నూలు ప్రధాన శాస్త్రవేత్త Dr. K. సుజాత, ఆదోని సహాయ వ్యవసాయ సంచాలకులు […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 25-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7569/- రూపాయలు కనిష్ట ధర ₹. 4719/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3306/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5967/- రూపాయలు కనిష్ట ధర ₹.4570/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

Back To Top
Exit mobile version