కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. AP 39TZ 1980 నెంబరు గల ఇసుక ట్రాక్టర్ ఢీకొని బోయ నాగిరెడ్డి (50) అనే వ్యక్తి మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయాన్నే తోపుడు బండిలో పశువులకు గడ్డి తీసుకుని వెళ్తుండగా వెనకనుంచి ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టిందని తెలిపారు. మృతుడికి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.