News
మహిళలు మాత్రమే పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు

■ ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నవారికి SIMHO HR Services వారి గొప్ప అవకాశం
■ కేవలం “మహిళలు మాత్రమే” పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు
కనీసం పదవతరగతి వరకు చదివి వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్యగల మహిళలకు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు పనిచేసే చోటు విడియోల కొరకు క్రింద ఇచ్చిన లింక్ ను చుడండి.
ఉద్యోగ వివరాలు :
కంపెనీ : స్మార్ట్ మొబైల్ తయారి కంపెనీ
పోస్ట్ : ప్రొడక్షన్ ఆపరేటర్
విద్యార్హతలు: 10th లేదా ఆపైన
వయస్సు : 18 నుండి 26లోపు
un Married
జీతం : Rs.13,740/-
షిఫ్ట్ లు : 3 రొటేషన్ షిఫ్ట్ లు కలవు.
పని గంటలు: 8 గంటలు నెలలో 26 రోజులు పని , నాలుగు రోజులు సెలవు
పనిచేయు స్థలం : చిత్తూరు
సదుపాయాలు : ఉచిత రవాణా, కాంటీన్, పి.ఫ్., ఇ.యస్.ఐ. సదుపాయలు
మీ పూర్తీ వివరాలను ఈ లింక్ ద్వారా పంపిచండి
https://docs.google.com/forms/d/e/1FAIpQLSexE3ZSRMpTYq8b5xMCHcaIuVKZWtYfvdTcFSqLgZx7_8t0Fg/viewform



News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
News4 weeks ago
హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర