News
కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి. గడ్డా ఫక్రుద్దీన్
2025 ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇస్తున్నారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని లో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ పత్రిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశారని.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో 16,347 పోస్టులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పేదలకు భోజనాలు పెట్టే 203 అన్న క్యాంటీన్ల, విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,400 కోట్లు సహాయం, అమరావతి పునః నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖ రైల్వే జోన్ పనులు, తల్లికి వందనం, దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు, మత్య్సకారు లకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు రెట్టింపు సహాయం, 90% సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ ఇలా చెప్పుకుంటు పోతే అనేక పధకాలు ప్రజల కు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. త్వరలో రైతు రుణమాఫీ, 15 ఆగస్టు కి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుందని అన్నారు. మరెన్నో… సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు అమలు చేస్తారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి జి ఎం డి షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
