కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ షమీనా, మెప్మా ఆఫీసర్ వీరారెడ్డి అధ్యక్షతన అర్బన్ మెప్ప మార్కెట్ను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని అర్బన్ లో సుమారుగా 3వేల పొదుపు గ్రూపులు ఉన్నాయని ప్రతి ఏడాది బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను రూ20 కోట్లు మంజూరు అయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు. ప్రతి పొదుపు మహిళకు లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని తెలిపారు. వారు తయారు చేసిన వంటకాలు, బట్టలు, తినుబండరాలు, ఆహార పదార్థాలను, బజార్లలో విక్రయించుకునేందుకు స్టాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఆదోనిలో ప్రత్యేకంగా మెప్మా బజారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప, మెప్మా సి ఓ లు అరుణ, కృష్ణవేణి, ఇదృష్ ఆర్పీలు పాల్గొన్నారు.