కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం జి.హోసల్లి గ్రామం సమీపంలో శుక్రవారం రోజు మోటార్ సైకల్ పై కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి కౌతాలం మండలం, తోవి గ్రామానికి చెందిన బోయ పాండవగల్లు ఊసేని ని అరెస్టు చేసి అతను నుండి 1152 (12 బాక్స్ లు) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లను, మోటార్ సైకల్ ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి మద్యం ప్యాకెట్లను మోటార్ సైకిల్ ని సీజ్ చేసినట్లు ఎస్ఐ బి. చిన్న పీరయ్య తెలిపారు. ఈ దాడుల్లో పెద్దతుంబలం ఎస్ఐ బి. చిన్న పీరయ్య, సిబ్బంది ఎస్.లక్ష్మినారాయణ, వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top