నీటి కుంటలో  పడి ఆరూగురు విద్యార్దులు మృతి

ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి . నీటి కుంటలో  పడి ఆరూగురు విద్యార్దులు మృత్యు వాత పడ్డారు . దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామానికి  చెందిన ఏడు మంది విద్యార్దులు సరదాగా ఈత నేర్చుకోవడానికి జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కనే ఉన్న నీటి కుంటవద్దకు వెళ్ళారు. ఈత కొట్టడానికి కుంటలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం తో ప్రమాదవశాత్తు నీటి కుంటలో  మునిగిపోయారు .

భీమేష్
వినయ్
సాయికిరణ్
కిన్నెరసాయి
శశికుమార్

అటుగా  ఉన్న వెళ్తున్నా గొర్రెల కాపరీ చూసి ఒక పిల్లవాడిని  కాపాడాడు, ఒడ్డుకు చేరిన ఆ పిల్లవాడు పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్ళి గ్రామస్థులకు చెప్పగా అందరు ఆ నీటి కుంటవద్దకు చేరుకొని పిల్లల కోసం గాలించగా ఆరుగురు విద్యార్థులు శవంగా తేలారు . ఆరుగురు విద్యార్థులను అందరిని నీటి కుంట నుంచి బయటికి తీశారు. అందరూ మృతి చెందారు మృతి చెందిన పిల్లలు ఒక్కరే కొడుకులు కావడంతో ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు భాద వర్ణాతీర్దం. హై స్కూల్ పక్కన ఉన్నటువంటి కొండల్లో కొందరు ఎర్రమట్టి తవ్వకాలు తోవడంతో అక్కడ గుంతలు ఏర్పడ్డాయని మొన్న కురిసిన వర్షాలకు ఆ కుంటలో నీళ్లు చేరడంతో పిల్లలు సరదాగా ఈత నేర్చుకోవడానికి వెళ్లి ఈ ప్రమాదం చోటు చేసుకుందని  గ్రామస్తులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top