రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులను కాపాడుతూనే వారికి అండగా ఉండడమే ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లక్ష్యమని ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం బీమాస్ హాల్లో ఆదోని నియోజకవర్గం అధ్యక్షుడు బసవరాజు అధ్యక్షతన ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జర్నలిస్టులకు సకాలంలో అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసి ప్రభుత్వమే గృహం నిర్మించేలా చూడాలన్నారు హెల్త్ కార్డులకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అహర్నిశలు కృషిచేస్తుందన్నారు మండల, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసి త్వరలోనే జిల్లా మహాసభలు నిర్వహించి ఫెడరేషన్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ ఫెడరేషన్ సభ్యత్వం తీసుకోవాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు నాగరాజ్, కార్యదర్శి మునెప్ప, ఉపాధ్యక్షులు ఉరుకుందప్ప, మురళి, వార్త బీమా, మహా న్యూస్ రఘునాథ్ రెడ్డి, చంద్ర, బి ఆర్ కె న్యూస్ వీరేష్, సుంకన్న పాల్గొన్నారు.



