Connect with us

News

రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించిన ఫాక్స్ కాన్

Published

on

పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్
◆ జాబ్ డెస్టినేషన్ గా ఏపీ
◆ 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
◆ ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్  సిటీ ఏర్పాటు చేయండి
◆ ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఎదురెళ్లి స్వాగతం పలికిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్
◆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఫాక్స్ కాన్

పూలబొకే అందించి స్వాగతం పలుకుతున్నారా లోకేష్

అమరావతి: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేష్, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఫాక్స్ కాన్ బృందానికి ఎదురెళ్లి లోకేష్ స్వాగతం పలికారు. కంపెనీ ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. 2014 నుండి 2019 వరకూ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్, ఈవీ పాలసీల గురించి వివరించారు. కియా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన విధానాన్ని ఒక కేస్ స్టడీ గా వివరించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు.

బహుమానం అందించి స్వాగతం పలుకుతున్నారా లోకేష్

ఫాక్స్ కాన్  మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి..
సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుండి 2019 వరకూ అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అందులో ఫాక్స్ కాన్ కూడా ఒకటి. 14 వేల మంది మహిళలకు నాడు మీరు ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు ఫాక్స్ కాన్  ఇండియా తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా కేవలం ఒక ప్లాంట్ పెట్టాలని నేను మిమ్మల్ని కోరడం లేదు. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేష్ కోరారు. ఫాక్స్ కాన్  మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని లోకేష్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. ఆ లక్ష్య సాధనలో ప్రధాన భూమిక పోషించాలని లోకేష్ ఫాక్స్ కాన్ ప్రతినిధులను కోరారు. అనుమతుల నుండి ఉత్పత్తి వరకూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా నేనే స్వయంగా రంగంలోకి దిగుతానని వారికి లోకేష్ భరోసా కల్పించారు. ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు.

బహుమానం అందించి స్వాగతం పలుకుతున్నారా లోకేష్

ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ..
ఫాక్స్ కాన్ కంపెనీ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి.లీ మాట్లాడుతూ.. పెట్టుబడులు ఆకర్షణలో సీఎం చంద్రబాబు చూపించే చొరవను కొనియాడారు. ఏపీతో తమకు మంచి అనుబంధం ఉందని. కానీ గత ఐదేళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకు అనేక ప్లాంట్లు ఉన్నాయని, ఇండియాలో భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. త్వరలోనే తమ బృందం ఏపీ అధికారులతో చర్చించి. ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని అన్నారు. మీ 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మా వంతు సహకారం అందిస్తామని లీ అన్నారు.

ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేష్

త్వరలోనే ఏపీలో కార్యకలాపాల విస్తరణ..
సోమవారం జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్ కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే తమ బృందం పర్యటించి పూర్తిస్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తుందని కంపెనీ ప్రతినిధులు లోకేష్ కు వివరించారు. ప్రభుత్వం తరపున మీకు పూర్తి సహకారంతో పాటు వీలైనంత త్వరగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని లోకేష్ కంపెనీ ప్రతినిధులతో అన్నారు.
ఈ సమావేశంలో ఫాక్స్ కాన్ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి.లీ, డైరెక్టర్ టూ ఫాక్స్ కాన్ ఛైర్మన్ ఆఫీస్ సెంథిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ భరత్ దండి, మేనేజర్ హానా వాంగ్, మేనజర్ వెక్టర్ చెన్, అసిస్టెంట్ మేనేజర్ గ్యారీ, ఐటి, ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరబ్ గౌర్ పాల్గొన్నారు.

ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేష్
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

Published

on

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
  • ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
  • తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Published

on

ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలు:

​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

భారీగా ఊట ధ్వంసం:

​పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడి గుర్తింపు:

​పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending