Connect with us

News

ఆదోని డివిజన్లో వర్షపాతం నమోదు..

Published

on

ఆదోని డివిజన్లో శనివారం 17 వ తేది కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించిన అధికారులు
హోళగుంద – 64.2 m.m
ఎమ్మిగనూరు- 28.4 m.m
కౌతాళం – 22.0 m.m
పెద్దకడబూరు – 17.6 m.m
ఆదోని – 15.2 m.m
కోసిగి- 14.4 m.m
గోనెగండ్ల- 12.4 m.m
నందవరం – 3.8 m.m
మంత్రాలయం – 0.0 m.m
మొత్తం వర్షపాతం – 178.0 m. m
సుమారుగా కురిసిన వర్షపాతం- 19.8 m. m

News

బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష

Published

on

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

డ్రైవర్లను కోర్టు నుంచి జైలుకు తీసుకు వెళ్తున్న పోలీసులు
Continue Reading

News

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.

Continue Reading

News

ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న  ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.

ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప  బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో  చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పరిశీలిస్తున్న పోలీసులు
Continue Reading

Trending