Connect with us

News

మట్కా రాస్తున్న ముగ్గురు అరెస్ట్ 1,20,000 నగదు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కారాస్తున్న ముగ్గురు అరెస్ట్. ఒకరు పరార్. వారి వద్ద నుండి 1 లక్ష 20 వేల నగదు 15 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకొన్నరు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జామియా మసీదు వెనకాల ఇంట్లో మట్కా రస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి మట్కా బీటర్లు చందాసాహేబ్ దర్గా వద్ద నివాసం ఉండే ఇస్మాయల్ , చౌకి మఠం నివాసి ఐన కన్నయ్య మరియు బబ్బులమ్మ గుడి వద్ద నివాసముండే శ్రీనివాసులు ముగ్గురిని అరెస్ట్ చేశామని మరో ఒకరు SKD కాలనీ కి చెందిన ఇక్బాల్ పరారీలో యూన్నాడని సిఐ విక్రమ సింహ తెలిపారు. వారి వద్దనుండి మట్కా చీటీలు, రూ. 1,20,000/- డబ్బులను, 15 లీటర్ల నిషేధిత నాటు సారాయ్ స్వాధీనం చేసుకొని ముగ్గురి కేసునమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ, సిబ్బంది రంగస్వామి, HC మద్దిలేటి , సుధీర్ , మధు, వెంకటేష్ మరియ ముస్తాక్ లు పాల్గొన్నారు….

మట్కా నిర్వాహకుల అరెస్టు చూపిస్తున్న సి ఐ విక్రమ సింహ

ప్రజలకు పోలీసువారి విన్నపం..
దయచేసి అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ , పేకాట ల గురించి మీకు తెలిస్తే కింది నెంబర్ సమాచారం ఇవ్వాలని
9121101135
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని సిఐ విక్రమ సింహ తెలిపారు.

యూట్యూబ్ వీడియో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన
Continue Reading

News

BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు

Published

on

ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Continue Reading

News

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 13.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 13 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1602.0 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 24.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 17152 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 16807 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 652 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.23 అడుగులుగా ఉండగా.. 77524 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 38071 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending