News
వ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య.. వ్యాధి నయం కావడం లేదన్న బెంగతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఆదోని సమీపంలో చోటుచేసుకుంది.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన మాల మల్లప్ప అనే వ్యక్తి గత కొంతకాలంగా కడుపులో గడ్డల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు అతడిని ఆదోనిలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో కర్నూలులోని ఓమ్ని హాస్పిటల్ వంటి పలు ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందించారని అయినప్పటికీ కడుపు నొప్పి తగ్గకపోవడంతో మల్లప్ప తీవ్ర వేదనకు గురయి జీవితంపై విరక్తి చెందిన ఆయన, బుధవారం (18.02.2026) ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఆదోని – ఇస్వి ఆర్ఎస్ (Isvi RS) మధ్య రైల్వే కిలోమీటర్ నంబర్ 497/32 వద్ద డౌన్ లైన్ ట్రాక్ పై అటుగా వెళ్తున్న గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆదోని – మంత్రాలయం రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News
అదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులని వన్ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… అదోని పట్టణంలోని అమరావతి నగర్, మారెమ్మ అవ్వ గుడి సమీపంలో మరియు ఆంజనేయ స్వామి దేవాలయం బావాజీపేట సమీపంలో గల ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదోని వన్ టౌన్ ఏఎస్ఐ ఎం. తిరుమల నాయక్ తన సిబ్బందితో బాబాజీ పేటలో హెడ్ కానిస్టేబుల్ ఎస్. సత్తార్ వలీ అమరావతి నగర్ లో ఆకస్మిక దాడి నిర్వహించారు.
బాబాజీ పేట కు చెందిన బోయ నాగరాజు (49) మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి సుమారు 22 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం లో బెంగళూరు విస్కీ (180 ML) స్వాధీనం చేసుకుని నిందితుడిపై ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 (A) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్ఐ ఎం తిరుమల నాయక్ తెలిపారు.
అమరావతి నగర్ కు చెందిన బోయ రామకృష్ణ (అలియాస్ రాముడు) (52) మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి సుమారు 16 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం లో 11 బాటిళ్ల ‘జాన్ ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్’ విస్కీ (180 ML), 05 బాటిళ్ల ‘మెక్ డోవెల్స్ నంబర్ 1 లగ్జరీ సుప్రీం’ విస్కీ (180 ML) స్వాధీనం చేసుకుని :నిందితుడిపై ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 (A) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ సత్తార్ వలీ తెలిపారు.
News
హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో మహిళా హత్య కేసులో ముద్దాయి దేవదాస్ కు జీవిత ఖైదు తీర్పును వెల్లడించరు ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి.జె. సుధా. 2021 జూన్ లో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో నమోదైన హరిజనలక్ష్మి అనే మహిళా హత్య కేసులో ఈ తీర్పును వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బైలుప్పల గ్రామానికి చెందిన తల్లి కృష్ణమ్మ తన కూతురు హరిజనలక్ష్మి బంధువుల పెళ్లికాని వెళ్లి ఇంటికి రాలేదని 13 వ తేదీ జూన్ 2021 వ సంవత్సరం లో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు రూరల్ సిఐ మంజునాథ్ Cr. No. 184/21 u/h wmen missing కేసుగా నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కేసును 302 IPC గా మార్చి ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించగా గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన హరిజన హంద్రీ దేవదాసు (37), బైలుప్పల గ్రామానికి చెందిన హరిజనలక్ష్మి అను మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె పై అనుమానం తో మృతురాలిని గుంతకల్లు చర్చికి వెళదామని దేవదాస్ మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని కసాపురం సమీపాన గల అడివిలో మృతురాలితో గొడవపడి హత్య చేసి పెట్రోల్ తో ఆమెను కాల్చి ఆమెపై ఉన్నటువంటి బంగారు వెండి ఆభరణాలు తీసుకొని వెళ్ళినట్లు ముద్దాయి పోలీసులతో తన వాంగ్మూలంలో తెలిపినాడు. CI మంజునాథ ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి జె సుధా ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పును వెల్లడించారు.
ఇదే తరహా నేరంలో తెలంగాణ రాష్ట్రంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అమ్మాయిని చంపినట్లు మరియు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక కేసు ఉన్నాయని ఈ రెండు కేసులు కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని జడ్జ్ పి జె సుధా తెలిపారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున పిపి మోతిలాల్ వాదనలు వినిపించారు.
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


