Magazine Stories
ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ గ్రేవ్ యార్డ్ ( సైకిల్ల స్మశాన వాటికలు)
■ చైనాలో ఒక్కొక్క డంపియాడ్ లో రెండు లక్షల సైకిళ్లు లెక్కలేనన్ని డంప్ యార్డ్ లు..
■ ఒక కోటి 60 లక్షల సైకిళ్లు రోడ్లపై తిరుగుతున్నాయి..
■ 2017లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో సైకిల్ బైక్ షేరింగ్ వ్యాపారం..
■ సైకిల్ స్మశాన వాటికలు..
చైనాలో కొన్ని సంవత్సరాల ముందు సైకిల్ బైక్ షేరింగ్ బాగా అభివృద్ధి చెందింది( బూమ్ నడిచింది).
ఒకచోట సైకిల్ని బాడుగకు (రెంట్ కు) తీసుకొని తాను వెళ్లాల్సిన చోటికి వెళ్లి గమ్యస్థానంలో వదిలి వెళ్ళిపోతారు. అక్కడ నుండి వేరే వాళ్ళు రెంటుకు తీసుకొని పోయేదాన్ని సైకిల్ బైక్ షేరింగ్ అంటారు. ఈ సదుపాయం మిడిల్ క్లాస్ వారికి ప్రయాణించడానికి చాలా బాగుండేది అతి తక్కువ ధరకు ప్రయాణం అనుకూలం కావడంతో ఎంతో మంది సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
చైనాలో అత్యంత ప్రసిద్ధ డాక్‌లెస్ బైక్-షేరింగ్ వ్యాపారం క్యాంపస్ స్టార్టప్‌గా ప్రారంభమైంది. 2015లో నలుగురు పెకింగ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు క్యాంపస్‌లో “ofo” అనే డాక్‌లెస్ షేర్డ్ బైక్‌లను ప్రారంభించారు. 2016లో నగరాల్లో, పట్టణా లో బైక్-షేరింగ్ సేవలను విస్తరించారు. 2016లో మరొక ప్రధాన బైక్-షేరింగ్ కంపెనీ Mobike తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంటర్నెట్ ద్వారా మొబైల్ యాక్టివేషన్ వచ్చిన తర్వాత దగ్గరలోని సైకిల్ల లొకేషన్ ను తెలుసుకునేవారు. ప్రజలకు ఈ సదుపాయం బాగా నచ్చింది దానివల్ల చాలా ఈజీ అయిపోయింది. కానీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు సైకిళ్లు అందుబాటులో ఉండేవి కావు అప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన పెద్ద పెద్ద కంపెనీలు మార్కెట్ డిమాండ్ ను చూసి బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి వ్యాపారాలు మొదలుపెట్టాయి 2017 నాటికి, దాదాపు 70 బైక్-షేరింగ్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క పట్టణంలో కొన్ని వేల నుంచి లక్షల సైకిళ్లు లను రోడ్లపై నిలబెట్టారు. దీంతో ప్రపంచంలోనే ఈ వ్యాపారము మొదటి స్థానంలో నిలబడింది.
ఒక సర్వే ప్రకారం 1 కోటి 60 లక్షల సైకిళ్లు రోడ్లపై తిరిగేవి. చైనాలో బైక్-షేరింగ్ పరిశ్రమ 2017 నుండి (బూమ్ వచ్చింది) బైక్-షేరింగ్ మార్కెట్లో వేగవంతంగా విస్తరించింది. 1 కోటి 20 లక్షల సైకిళ్లు అవసరం ఉన్న చోట కంపెనీలు 2 కోట్ల 30 లక్షల సైకిళ్లు నిలబెట్టారు అవసరానికి మించి రెండింతల సైకిల్ లు ఎక్కువైపోయాయి దీంతో లాభాల నుంచి నష్టాల బాటకు మార్కెట్ పతనం మొదలైంది. పార్కింగ్ చేయడానికి స్థలం లేక ప్రతి వీధి సందులో సైకిల్ కుప్పలు కుప్పలుగా పడిపోయాయి 2018లో సగానికి పైగా కంపెనీలు దివాళ తీయడం మొదలయ్యాయి. ఆ కంపెనీల సైకిళ్లు అనాధల్లా రోడ్ల పక్కన పడి ఉండేవి. దీనిపై చైనా ప్రభుత్వం పట్టణాలకు శుభ్రం చేయడానికి సైకిళ్లను డంపింగ్ యార్డ్ లో జమ చేయడం మొదలుపెట్టారు. ప్రతి వీధు సందుల్లో మూలకు ఉన్న సైకిళ్లను డంప్యాడ్లకు తెచ్చి పడేసేవారు. ఈ విధంగా ఒక డంప్ యాడ్ లో సుమారు 2 లక్షల సైకిళ్లు పడి ఉన్నాయి. చైనాలో లెక్క లేనన్ని చిన్న పెద్ద డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యాడ్స్ ని బై సైకిల్ గ్రేవ్ యార్డ్ పేరుతో పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు కూడా బైక్ షేరింగ్ ఉంది కానీ వ్యాపారం పెరగడం లేదు.
Magazine Stories
సోషల్ మీడియా హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా?
◆ సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?
కర్నూలు జిల్లా:
సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోంది. పోస్టుల్లో మాటలు హద్దులు దాటి పత్తా లేకుండా పోయిన వారు ఎందరు? సోషల్ మీడియా యూజర్లకు మోగుతున్న వార్నింగ్ బెల్స్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందేనా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?
సోషల్ మీడియా అంటేనే ఏపీలో చాలామందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని కాదు.. హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందించారు.
అంతెందుకు ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నరసరావుపేట కు చెందిన సుధారాణిపై, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు. అదే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అనంతపురం జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన జె. రామాంజనేయులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసు నమోదు చేశారు.
ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్టు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ మరో కేసు ఫైల్ అయ్యింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు. పోస్టు ఎప్పుడు పెట్టారన్నది కాదు.. తప్పుగా పెట్టారా లేదా అన్నట్లుగా వెతికి పట్టుకుంటున్నారు పోలీసులు. వర్మకు జస్ట్ నోటీసులు మాత్రమే. సోషల్ మీడియాలో హద్దులు దాటిన చాలామంది ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది అసభ్యకర పోస్టులే. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టులు పెట్టే వారిపై ఏపీ పోలీసులు వారం రోజులుగా చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తూ అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరికొందరికి విచారణ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే, ఇందులో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ లపైనా కేసులు నమోదయ్యాయి.
డైరెక్టర్ ఆర్జీవీ, పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని కోర్టులో ఓ పిల్ వేయగా..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో తప్పేముందని ప్రశ్నించడమే కాదు.. కేసులు పెట్టొద్దని పోలీసులను ఆదేశించలేము అని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా పైశాచికత్వం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
చేసే ప్రతి పోస్టు, రాసే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా యూజర్లు ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. హద్దుల్లో లేకపోతే ప్రమాదంలోకి అడుగు పెట్టినట్లే. విమర్శలు చేయడంలో తప్పు లేదు. హద్దులు దాటి ఓవరాక్షన్ చేస్తేనే అసలు సమస్య. ఇంతకీ సోషల్ మీడియా ఘోరాలపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఆ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం నాశనమేనా?
Magazine Stories
మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనుడు
★ సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఓడిపోయి రికార్డు సృష్టించాడు. 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.
★ సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న నా ప్రయత్నం.. తమిళనాడుకు చెందిన పద్మరాజన్
తమిళనాడుకు చెందిన పద్మరాజన్ ఒక టైర్ పంచర్ రిపేర్ షాప్ ఓనర్ ఇతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ అన్ని సార్లు ఓడిపోయాడు. 1988 నుండి ఇప్పటివరకు లోకల్ ఎలక్షన్స్ నుండి లోక్సభ ఎలక్షన్స్ వరకు చివరికి ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశాడు. అలా ఈయన 6 ప్రెసిడెన్షియల్ 6 వైస్ ప్రెసిడెన్షియల్ 32 లోక్సభ 50 రాజ్యసభ 73 పార్లమెంటరీ ఎలక్షన్స్ లలో పోటీ చేశాడు.
ఇతను వాజ్పేయ్, పివి నరసింహారావు, జయలలిత, కరుణానిధి, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రాహుల్ గాంధీ, విజయకాంత్, మోదీ ఇలా ఎంతో మంది ప్రముఖుల మీద పోటీ చేశాడు. అయితే ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ గా కొంత అమౌంట్ పే చేయలి ఆ నగదును తన టైర్ పంచర్ రిపేర్ షాప్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఎలక్షన్ నామినేషన్స్ కోసం సెక్యూరిటీ డిపాజిట్లు సుమారుగా 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందట.
ఇన్ని ఎలక్షన్స్ లో పాల్గొన్నా కానీ ఒక్కసారి కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయలేదు నామినేషన్స్ వేసిన ప్రతిసారి ఓడిపోవాలని కోరుకుంటారట మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి ఇతను ఇలా పోటీ చేస్తున్నాడట ఓడిపోతున్నా సరే పట్టించుకోకుండా ఇన్ని ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ కాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.
Magazine Stories
డెంగ్యూ వ్యాధి నుండి కోలుకునేందుకు సహాయపడే ఆహార పదార్థాలు
కర్నూలు జిల్లా.. ఆదోని ప్రకృతి వైద్యం : దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2024 సంవత్సరంలో ముఖ్యంగా దోమల వల్ల వచ్చే అనారోగ్యాల వ్యాప్తికి సంబంధించినంత వరకు ఆందోళనకరంగా ఉంది. వెచ్చని ఉష్ణోగ్రతలు, అధిక తేమ స్థాయిలు ఏడెస్ దోమల సంతానోత్పత్తి, వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. డెంగ్యూ అనేది డి.ఈ. ఎన్. వి, వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దోమ కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. భారతదేశమే కాదు అనేక దేశాలు 2024లో డెంగ్యూ కేసుల్లో విపరీతమైన పెరుగుదలను చూస్తున్నాము. డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి మీ ఆహారంలో పోషక విలువలని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్లేట్‌లెట్స్ కోల్పోవడం, శరీరంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా, మీ శక్తిని తిరిగి పొందడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్లేట్‌లెట్‌లను ఉత్పత్తి చేయడానికి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను అవసరమైనంతగా ఉంచడానికి మీ శరీరానికి ఇనుము వంటి అవసరమైన పోషకాలు కూడా అవసరం. పండ్లు, కూరగాయలు విటమిన్లు, ఖనిఏజాలు, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలోను మరియు రికవరీలో సహాయపడతాయి.
విజయ లక్ష్మి, ప్రకృతి వైద్య సలహాదారులు,
సెల్ : 99854 70289
డెంగ్యూ వ్యాధి రికవరీలో సహాయపడే ఆహార పదార్థాలు మరియు పండ్లు, కూరగాయల
1. వీట్ గ్రాస్ జూస్
డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు సమర్థవంతంగా కోలుకోవడానికి వీట్ గ్రాస్ జూస్ తీసుకోవడం చాలా అవసరం ఈ గోదుమ గడ్డి జూస్ లో విటమిన్ ఏ,సి,ఈ,కె, మరియు బి.కాంప్లెక్స్ రకాల మిటమిన్లు ఉన్నాయి, అంతే కాదు ఇందులో కాల్షియం, ఐరన్, మిగ్నిషియం, పష్పరాస్, పొటాషియం, సోడియం, జింగ్, మరియు కాపర్ పుస్కాలంగా ఉన్నాయి అంతే కాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల మీరు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.
2. కివి
డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు సమర్థవంతంగా కోలుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కివీ పండులో విటమిన్ సి, పొటాషియం కంటెంట్, పాలీఫెనాల్స్, గల్లిక్ యాసిడ్, ట్రోలాక్స్ సమానమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం యొక్క రోగనిరోధక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్‌తో సమర్థవంతంగా పోరాడడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.
3. బొప్పాయి
బొప్పాయిలో పాపైన్, కారికైన్, చైమోపాపైన్, ఎసిటోజెనిన్ మొదలైన కొన్ని జీవసంబంధ క్రియాశీల సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం యొక్క రోగనిరోధక స్థితిని బలోపేతం చేయడానికి, డెంగ్యూ సంబంధిత మంటను తగ్గించడానికి, వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.
4. దానిమ్మ
ఈ పండులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క హెమటోలాజికల్ అవసరాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్‌ను సంరక్షించడంలో సహాయపడుతుంది. ఇది డెంగ్యూ జ్వరం సమయంలో, ఆ తర్వాత కూడా వచ్చే అలసటను, నీరసాన్ని తగ్గిస్తుంది. శరీరానికి తగిన శక్తినిస్తుంది.
5. పాలకూర
విటమిన్ కె యొక్క అద్భుతమైన మూలం ఇది. నేరుగా ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచదు కానీ రక్త కణాలు బాగా గడ్డకట్టడంలో సహాయపడుతుంది. డెంగ్యూ రోగులకు పాలకూర ఇతర కీలక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిలో ఐరన్, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌లను అణిచివేయడం ద్వారా శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది వైరస్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అలసట, బలహీనత వంటి లక్షణాల నుండి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
6. బీట్‌రూట్
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధిక స్థాయిలో బీట్‌రూట్‌లో ఉంటాయి. అదనంగా బీట్‌రూట్ మలినాలను శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ కాలేయాన్ని శుభ్రపరచడానికి, దాని పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. డెంగ్యూ సంబంధిత మంట కారణంగా శరీరంలోని ప్లేట్‌లెట్స్ యొక్క ఫ్రీ రాడికల్ నష్టాన్ని నివారిస్తుంది. బీట్‌రూట్ హెమటోలాజికల్ స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది.
7. సిట్రస్ పండ్లు
నారింజ, జామకాయ, నిమ్మకాయ మొదలైన సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సీకరణను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. తద్వారా రక్తస్రావం ప్రమాదాన్ని, ప్లేట్‌లెట్ మార్పిడి అవసరాన్ని తగ్గిస్తుంది.
8. గుమ్మడికాయ
గుమ్మడి కాయలో విటమిన్ ఎ, బీట కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడగలవు.
9. మెంతి కశయం
మెంతి కశయం కూడా డెంగ్యూ వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి సహాయ పడుతాయి ఇందులో యాంటీ ఇంప్లమేటరీ గుణాలు ఉండడం వల్ల మీ శరీరం జ్వరం కారణంగా పెరిగిన వేడిని తగ్గిస్తాయి.
-
News3 weeks ago
దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
-
Business20 hours ago
Gold, Silver Price బంగారు వెండి ధరలు
-
News6 days ago
ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి
-
News21 hours ago
కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
-
News6 days ago
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన
-
News4 weeks ago
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
-
News2 weeks ago
బిజెపి పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు
-
News23 hours ago
మురికి కాలువలో మృతదేహం