News
క్షమించు గణనాథా
◆ కాలువలో తేలి ఉన్న గణనాథులు
◆ పట్టించుకోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు
◆ నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులు.
◆ చూడడానికి ఇబ్బందిగా ఉంటూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కాలువలో తేలి ఉన్న గణనాథులు..
కర్నూలు జిల్లా ఆదోని లో గణనాథులకు భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు పూజలు నిర్వహించి నిమర్జనం లో భాగంగా ఎల్ఎల్సీ కాలువలో వీటిని అర్ధరాత్రి ఎంతోమంది అధికారుల మధ్య నిమజ్జనం ఏర్పాటు చేశారు, ఆ రహదారి ఆదోని నుండి బాంబే హైవే కావడంతో ఎంతోమంది గణనాథ విగ్రహాలు ఇలా పడి ఉండడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద హరివాణం గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తయారీ వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని ప్రముఖులు, మేధావులు, చెబుతూనే ఉన్నారు. అయితే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇలాంటి అవగాహన కల్పించకుండా పోవడం వల్ల భారీ వినాయకులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసి నిమజ్జనం చేయడం వల్ల ఇలా పర్యావరణానికి హాని కలుగుతుందని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కనిపిస్తూ ఉందని ప్రజలు, భక్తులు చెబుతున్నారు. ఒక అడుగు నుంచి మూడు అడుగుల మట్టి వినాయకులైతే నీళ్లలో నిమజ్జనం చేసిన వెంటనే కరిగిపోతాయని దీనిపై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో నీరు కలిసితం కాకుండా, ఎవరికి గాని హాని ఉండదని తెలిపారు.. ప్లాస్టర్ పారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితమై తాగే పశువులకు, మనుషులకు, పంటలకు ఎంతో హాని కలిగి రోగాల బారిన పడే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరారు.
News
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 24
ఆదోని 03 12 24:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు
News
తృటిలో తప్పిన ప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారులో తెల్లవారు జామున ఎమ్మిగనూరు బైపాస్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తపింది. కర్ణాటక కు చెందిన కె ఎ.02ఎం యు 5864 నెంబర్ గల కారు బెంగళూరు నుండి దైవదర్శనానికి మంత్రాలయానికి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ పైకెక్కి స్తంబానికి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
News
కురువ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దేవేంద్రప్ప
విజయవాడ గొల్ల పూడి బీసీ భవనంలో బుధవారం కురువ కార్పోరేషన్ చైర్మన్ గా మాన్వి దేవేంద్రప్ప పదవి బాధ్యతలు స్వీకరించరు. అసిస్టెంట్ డైరెక్టర్ తనూజ ప్రమాణం చేయించరు. బాధ్యతల అనంతరం ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబును, బీసీ సంక్షేమ మంత్రి సవిత్రమ్మకు దన్యదములు తెలిపారు.
ఈ సందర్భంగా మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ ఈ బాధ్యతలు తనకు ఇవ్వటం హర్షణీయం అని రానున్న రోజుల్లో కార్పోరేషన్ నిధుల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ఉపాధి అవకాశాలు మెరుగుచేస్తానని తన పదవికి న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఉద్యోగులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
Business2 weeks ago
Gold, Silver Price బంగారు వెండి ధరలు
-
News1 week ago
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
-
News2 weeks ago
పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి
-
News3 weeks ago
ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి
-
News2 weeks ago
కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
-
News3 weeks ago
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన
-
News2 weeks ago
మురికి కాలువలో మృతదేహం
-
News2 weeks ago
13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్