News
హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో మహిళా హత్య కేసులో ముద్దాయి దేవదాస్ కు జీవిత ఖైదు తీర్పును వెల్లడించరు ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి.జె. సుధా. 2021 జూన్ లో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో నమోదైన హరిజనలక్ష్మి అనే మహిళా హత్య కేసులో ఈ తీర్పును వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బైలుప్పల గ్రామానికి చెందిన తల్లి కృష్ణమ్మ తన కూతురు హరిజనలక్ష్మి బంధువుల పెళ్లికాని వెళ్లి ఇంటికి రాలేదని 13 వ తేదీ జూన్ 2021 వ సంవత్సరం లో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు రూరల్ సిఐ మంజునాథ్ Cr. No. 184/21 u/h wmen missing కేసుగా నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కేసును 302 IPC గా మార్చి ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించగా గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన హరిజన హంద్రీ దేవదాసు (37), బైలుప్పల గ్రామానికి చెందిన హరిజనలక్ష్మి అను మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె పై అనుమానం తో మృతురాలిని గుంతకల్లు చర్చికి వెళదామని దేవదాస్ మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని కసాపురం సమీపాన గల అడివిలో మృతురాలితో గొడవపడి హత్య చేసి పెట్రోల్ తో ఆమెను కాల్చి ఆమెపై ఉన్నటువంటి బంగారు వెండి ఆభరణాలు తీసుకొని వెళ్ళినట్లు ముద్దాయి పోలీసులతో తన వాంగ్మూలంలో తెలిపినాడు. CI మంజునాథ ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి జె సుధా ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పును వెల్లడించారు.
ఇదే తరహా నేరంలో తెలంగాణ రాష్ట్రంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అమ్మాయిని చంపినట్లు మరియు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక కేసు ఉన్నాయని ఈ రెండు కేసులు కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని జడ్జ్ పి జె సుధా తెలిపారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున పిపి మోతిలాల్ వాదనలు వినిపించారు.
News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


News
ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్
ఆదోనిలో అధికారులు మెరుపు దాడులతో విరుచుకుపడ్డారు. సామాన్యుడి పొయ్యి వెలగాల్సిన డొమెస్టిక్ గ్యాస్‌ను.. హోటళ్లలో వాడుతూ సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టు చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హోటల్ యజమానుల ఆటలు సాగనివ్వమని సివిల్ సప్లై అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ ధరకు వచ్చే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో DSO రాజా రఘువీర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు పట్టణంలోని గల్లీ గల్లీని జల్లెడ పట్టాయి. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, చిన్నా చితకా హోటళ్లు అని తేడా లేకుండా అధికారులు సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తనిఖీ చేసిన 88 హోటళ్లలో 107సిలిండర్లు సీజ్ చేసి వారిపై ఎసెన్షియల్ కమ్యూడిటి యాక్ట్ సెక్షన్ 6ఎ క్రింద కేసు నమోదు చేశారు. గృహ వినియోగ గ్యాస్‌ను వ్యాపారాలకు వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్ఓ రాజా రఘువీర్.
ప్రస్తుతానికి ఈ దాడులు ఆదోని హోటల్ యజమానుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అక్రమంగా సిలిండర్లు దాచిన వారు ఇప్పుడు వాటిని ఎక్కడ దాచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరి అధికారులు ఈ జోరును ఇలాగే కొనసాగిస్తారో లేదో చూడాలి..



News
హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు
తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల హెచ్చరిక
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
వినియోగదారులకు సూచనలు:
- సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
- అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
- టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
