News
సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్ కాలనీలో బెరాకా ప్రార్థనా మందిరములో పాస్టర్ ఆశీర్వాదం అధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మన దేశములో అన్ని కులాలు, మతాలు సమానంగా గౌరవించబడతాయని, భగవద్గీత , ఖురాన్ మరియు బైబిల్ గ్రంధం ఏదయినా, మతము ఏదయినా అందరము కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటారు, సోదర భావంతో భారతీయులు ఉంటారు కాబట్టే భారతదేశ ఔన్నత్యాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా భారతీయులు ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడుతున్నారని, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన, ఖురాన్ లో అల్లా చెప్పిన, బైబిల్ లో ఏసు క్రీస్తు చెప్పిన మానవులు అహింసను విడనాడి, భారతీయులందరూ సన్మార్గములో నడవాలనే చెబుతాయి కాబట్టి మనందరమూ మత గ్రంథాలలో చెప్పిన మంచిని గ్రహించి సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటుకుందామని లలితమ్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో పాస్టర్ ప్రభాకరరావు, శాంతమ్మ, బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భాషా, వెల్లాల మధుసూదనశర్మ, శ్రీరాములు, మధు, మొదలైన వారందరూ పాల్గొన్నారు.



News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 14-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.49 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.106 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 43223 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 36345 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 14 07 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు


News
చెడు నడవడిక గల వారికి పోలీసుల కౌన్సిలింగ్

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెడు నడవడిక గల వారందరినీ పిలిపించి సిఐ ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మీడియాకు తెలిపిన వివరాలు కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు ఆదోని సబ్ డివిజనల్ ఆఫీసర్ మేడమ్ హేమలత పర్యవేక్షణలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్న వారందరినీ మంచి ప్రవర్తనతో ఉండాలని, ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దని, సమాజంలో మంచిగా బతుకుతూ, ఇతరుల పట్ల సోదర భావం కలిగి ప్రశాంతంగా జీవించాలని తెలియజేశారు.

-
News2 weeks ago
తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల
-
News2 weeks ago
తుంగభద్రా డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
News2 weeks ago
తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News2 weeks ago
తుంగభద్రా డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
News2 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News2 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025
-
News2 weeks ago
తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి