News
ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు
ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 15.05.2023
పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 7538-00
మధ్యధర ₹ 7299-00
కనిష్టం ₹ 4829-00
వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7619-00
మధ్యధర ₹ 6849-00
కనిష్టం ₹ 3806-00
ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 5485-00
మధ్యధర ₹ 5288-00
కనిష్టం ₹ 4755-00
పూల విత్తనాలు ధర
గరిష్టం ₹ 0000-00
మధ్యధర ₹ 0000-00
కనిష్టం ₹ 0000-00
News
13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ) రూ. 8 లక్షల 4 వేల నగదు మొత్తము సుమారు రూ.41 లక్షల, 11 వేల, 8 వందల ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్నరు.
ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ అభినందించి, రివార్డులు అందజేశారు.
News
ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.
ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీ యజమానులు ఏసీబీని ఆశ్రయించారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసిబి డిఎస్పి పి. రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్. మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
News
కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.
కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది.
బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బు తీసుకుతుండగా కూతురు మౌనిక అడ్డుకొని డబ్బు తీసుకున్న విషయం నాన్నమ్మ కు చెబుతానని చెప్పడంతో తాగిన మత్తులో దొంగతనం గురించి తన తల్లికి చెబుతుందోమేనని తాడుతో గొంతు బిగించి హత్య చేశాడని బంధువులు తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పరి పోలీసులు వీరేశ్ పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
-
Business1 day ago
Gold, Silver Price బంగారు వెండి ధరలు
-
News3 weeks ago
దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
-
News6 days ago
ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి
-
News1 day ago
కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
-
News6 days ago
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన
-
News4 weeks ago
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
-
News1 day ago
మురికి కాలువలో మృతదేహం
-
News2 weeks ago
బిజెపి పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు