News
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం జాలవాడి సచివాలయం సమీపంలో కురువ గులెప్ప అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు గమనించి మంటలను ఆర్పి అంబులెన్స్ ద్వారా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి..
కంబలదిన్నె గ్రామానికి చెందిన కురువ గులెప్పగా పోలీసులు గుర్తించామని తెలిపారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు కుటుంబ కలహాలుతో అని కొందరు, అప్పుల బాధతో అని మరికొందరు ఆత్మహత్య యత్నంకు పాల్పడి ఉండవచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News
ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుంటే ఇక్కడే పని చేసుకుంటున్నా ఉపాధి కూలీల జీతాలు చెల్లించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో మంగళవారం దొడ్డనకేరి, మంత్రికి, పెసల బండ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ఐదు వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే గ్రామాలు ఖాళీ అవుతుంటే, ఇక్కడే పనులు కల్పిస్తామని చెబుతున్న అధికారులు వేతనాలు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని, చట్టంలో చెప్పినట్లుగా పని చేసిన 14 రోజుల లోపల వేతనాలు ఇవ్వాల్సి ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉపాది హామీ వేతనాలు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కూలీలతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
News
ట్రాఫిక్ సమస్య పై సమావేశం నిర్వహించిన అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ సమస్యపై పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, డిఎస్పి మేడం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ మరియు పట్టణం నందు సీసీ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లు ముఖ్యమైన సర్కిల్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయటం అదే విధంగా రోడ్డుకు అడ్డంగా ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం గురించి చర్చించరు. ఈ సమావేశంలో మున్సిపాల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎసిపి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సిఐ పాల్గొన్నారు.
News
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారుల దాడులు
అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచిన స్థావరాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు నిర్వహించారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచి అమ్మకాలు నిర్వహిస్తున్న స్థావరంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించరు. ఈ దాడుల్లో ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 672 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైదుల్ మీడియాతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు కురువ రాము, మెహబూబ్ భాష వారి ఇంటి ఆవరణంలో స్టాక్ పాయింట్లు నిల్వ ఉంచిన 7 బాక్స్లో కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడుల్లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైదుల వారి సిబ్బందితో పాల్గొన్నట్లు తెలిపారు.
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business1 week ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business1 week ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు