Connect with us

News

టిడిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం…!

Published

on

అమరావతి : నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై నమోదు చేసిన కేసులు వివరాలు ఇప్పటికి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చిన కొంతమంది నాయకులు స్పందించకపోవడంపై సీరియస్ అయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిలు నిర్లక్ష్యం వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో రాష్ట్ర ప్రజల, కార్యకర్తల వారి సమస్యలు కోసం తన నివాసంలో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అనేకమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పై కేసు ఉన్నాయంటూ ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల చిన్న చిన్న సమస్యలు కూడా తెచ్చుకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జులు ఐ టి డి పి, సోషల్ మీడియా వాళ్ళు వద్ద వివరాలు ఉంటాయి వారి వద్ద నుంచి అనేక సమస్యలను సేకరించండి అని సూచించారు. పార్టీ చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సోషల్ మీడియా, ఐటిడిపి, వాళ్లని తీసుకొని ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో గుర్తింపు వచ్చే విధంగా చేసుకోవాలని సూచించారు.

Continue Reading
1 Comment

1 Comment

  1. H అదినారాయణ

    14/07/2024 at 7:18 pm

    మరి నిన్న 13/7/24 వతేదీన online నంబరు కేటాయించిన వారితో CBNగారు మాట్లాడలేదు. పల్లా శ్రీనివాసరావు గారు నిర్వహించారు. వచ్చిన ప్రజలు కొంత నిరుత్సాహం చెందారు.
    భవిష్యత్ లో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Published

on

ఆదోనిలో అధికారులు మెరుపు దాడులతో విరుచుకుపడ్డారు. సామాన్యుడి పొయ్యి వెలగాల్సిన డొమెస్టిక్ గ్యాస్‌ను.. హోటళ్లలో వాడుతూ సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టు చేశారు.

    కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హోటల్ యజమానుల ఆటలు సాగనివ్వమని సివిల్ సప్లై అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ ధరకు వచ్చే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో DSO రాజా రఘువీర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు పట్టణంలోని గల్లీ గల్లీని జల్లెడ పట్టాయి. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, చిన్నా చితకా హోటళ్లు అని తేడా లేకుండా అధికారులు సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తనిఖీ చేసిన 88 హోటళ్లలో 107సిలిండర్లు సీజ్ చేసి వారిపై ఎసెన్షియల్ కమ్యూడిటి యాక్ట్ సెక్షన్ 6ఎ క్రింద కేసు నమోదు చేశారు. గృహ వినియోగ గ్యాస్‌ను వ్యాపారాలకు వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్ఓ రాజా రఘువీర్.

    ప్రస్తుతానికి ఈ దాడులు ఆదోని హోటల్ యజమానుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అక్రమంగా సిలిండర్లు దాచిన వారు ఇప్పుడు వాటిని ఎక్కడ దాచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరి అధికారులు ఈ జోరును ఇలాగే కొనసాగిస్తారో లేదో చూడాలి..

    సీజ్ చేసి తీసుకు వస్తున్న గ్యాస్ సిలిండర్లు
    సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్లు
    తనిఖీలు నిర్వహిస్తున్న  డీఎస్ఓ రాజా రఘువీర్
    Continue Reading

    News

    హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

    Published

    on

    ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

    ​అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు

    ​తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

    ​అధికారుల హెచ్చరిక

    ​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

    ​డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం

    ​ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

    ​వినియోగదారులకు సూచనలు:

    • సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
    • అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
    • ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
    • టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
    Continue Reading

    News

    ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!

    Published

    on

    ​కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు.

    ​​కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. పద్మావతి నగర్ లో రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 20 వేల రూపాయల నగదు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. సాయి నగర్ కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైనట్లు సమాచారం. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ​వరుస చోరీలపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

    Continue Reading

    Trending