Connect with us

News

2 కోట్లు వాచీ గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ..

Published

on

షారూఖ్, రణ్‌వీర్ తదితరులకు గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ
లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ వాచీలతో ఫొటోలు, వీడియోలకు పోజులు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఈ నెల 12 ఘనంగా జరిగింది. గతేడాది డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంబానీ ఇంట వేడుకలు జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌లో వివాహంతో అనంత్-రాధిక ఒక్కటయ్యారు. 13 తేదీ జరిగిన ఆశీర్వాద వేడుకకు భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు సహా ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిమంది అతిథులు హాజరయ్యారు.


తాజాగా ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. తనకు స్నేహితులైన బాలీవుడ్ నటులు షారూఖ్‌ఖాన్, రణవీర్‌సింగ్, షికర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జాఫరి తదితరులకు వరుడు అనంత్ అంబానీ ఒక్కొక్కరికీ రూ. 2 కోట్ల విలువైన రిస్ట్ వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ క్యాలెండర్ లిమిటెడ్ ఎడిషన్ వాచీలను వీరు బహుమతిగా అందుకున్నారు. అనంతరం అందరూ కలిసి చేతికి ధరించిన వాచీలు చూపిస్తూ ఫొటోలు, వీడియోలకు పోజిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending