కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో సిపిఎం నాయకులు రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ పెద్ద తులం గ్రామంలో ఒకటి రెండు వార్డులలో రేషన్ బియ్యం గత 15 సంవత్సరాల నుండి సరఫరా చేస్తున్నారని, కానీ ఈ మధ్యనే 1-2 వార్డులలో కాకుండా డీలర్ తన సొంత ఇల్లు ఉన్న దొడ్డిగేరి ప్రాంతంలో రేషన్ బియ్యం సరఫరా చేయడం వలన ఈ ఒకటి, రెండు వార్డులలో నివసించే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కావున ప్రభుత్వం ఒకటి, రెండు వార్డులలోనే ప్రభుత్వ రేషన్ బియ్యం దుకాణం ఏర్పాటు చేయాలని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కు కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఒకటి రెండు వార్డులలోనే రేషన్ బియ్యం దుకాణం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు కాజా, ఒకటి, రెండు వార్డులలో నివాసం ఉంటున్న ప్రజలు పాల్గొన్నారు.