Day: September 12, 2025

రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో సిపిఎం నాయకులు రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ  పెద్ద తులం గ్రామంలో ఒకటి రెండు వార్డులలో  రేషన్ బియ్యం గత 15 సంవత్సరాల నుండి సరఫరా చేస్తున్నారని, కానీ ఈ మధ్యనే 1-2  వార్డులలో కాకుండా డీలర్ తన సొంత ఇల్లు ఉన్న దొడ్డిగేరి ప్రాంతంలో […]

విద్యుత్ సరఫరా అంతరాయ నోటీసు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలలో  13/09/2025 2వ శనివారం రోజులన ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆదోన విద్యుత్ శాఖ APSPDCL అధికారులు తెలిపారు. 132/32 KV, 33/11 KV సబ్-స్టేషన్లు, విద్యుత్ లైన్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఆదోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులందరూ సహకరించాలని అధికారులు కోరారు. ఏదైనా అసౌకర్యం కలిగితే చాలా చింతిస్తున్నామన్నారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి

కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డా.ఏ. సిరి మేడంను కర్నూలు స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో   ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ఆదోని సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో కొనసాగుతున్న వరుస వర్షాల దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత విభాగాల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం రామ్ జల చెరువు మరియు లోతట్టు  ప్రాంతాలను అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణను కట్టుదిట్టంగా చూసుకోవడమే కాకుండా అవసరమైన చోట్ల తక్షణ […]

Back To Top