News
ఏపీలో 19 మంది ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా,
హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితుల య్యారు.
3)జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
4)ఆర్.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్
5)జి.జయలక్ష్మి- సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు
6)కాంతిలాల్ దండే- ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ
7)సురేశ్ కుమార్- పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి
8)సురేశ్ కుమార్- గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు
9)జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు
10)సౌరభ్ గౌర్- ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు
11)యువరాజ్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి
12)హర్షవర్ధన్- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు
13)పి.భాస్కర్- వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి
14)పి.భాస్కర్- ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు
15)కె.కన్నబాబు- సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి
16)గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు
17)వినయ్‌చంద్- పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ
వివేక్ యాదవ్- యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి సూర్యకుమారి- మహిళా, శిశుసంక్షేమం, దివ్వాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ
– సి.శ్రీధర్- ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బాధ్యతలు
– జె.నివాస్- ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్
– విజయరామరాజు- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్
– హిమాంశు శుక్లా- సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్
– ఢిల్లీరావు- వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్
– వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్‌ను బదిలీ
– గిరిజాశంకర్- ఆర్థికశాఖ నుంచి రిలీవ్ అయ్యారు.
News
ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.
ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీ యజమానులు ఏసీబీని ఆశ్రయించారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసిబి డిఎస్పి పి. రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్. మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
News
కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.
కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది.
బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బు తీసుకుతుండగా కూతురు మౌనిక అడ్డుకొని డబ్బు తీసుకున్న విషయం నాన్నమ్మ కు చెబుతానని చెప్పడంతో తాగిన మత్తులో దొంగతనం గురించి తన తల్లికి చెబుతుందోమేనని తాడుతో గొంతు బిగించి హత్య చేశాడని బంధువులు తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పరి పోలీసులు వీరేశ్ పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
News
మురికి కాలువలో మృతదేహం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం భాహర్ పేట లో దారుణం చోటుచేసుకుంది. మురికి కాలువ లో సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ గౌస్ మృతదేహం లభ్యం అయ్యింది.
సిఐ రామలింగమయ్యా తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువ నుండి బయటకి తీసి అక్కడే పడి ఉన్న కూరగాయలు కోసే కత్తిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రాథమిక విచారణలో గౌస్ సెన్ట్రింగ్ కార్మికుడు గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడని. గత ఏడాది తండ్రి మృతి చెందగా ఇటీవల కొంతకాలంగా మతి స్థిమితం స్థిరంగా ఉండడటం లేదని యదావిధిగా ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయటికి వెళ్లాడని, ఘటనా స్థలంలో లభ్యమైన కత్తి కూడా ఇంట్లోదని కుటుంబ సభ్యులు తెలిపారని , ఈ ఘటనలో పూర్తి విచారణ చేసి ఇది ఆత్మహత్యనా లేక హత్యనా తెలుస్తామని అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించమని సిఐ తెలిపారు.
-
News3 weeks ago
దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
-
Business23 hours ago
Gold, Silver Price బంగారు వెండి ధరలు
-
News6 days ago
ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి
-
News24 hours ago
కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి
-
News6 days ago
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన
-
News4 weeks ago
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
-
News2 weeks ago
బిజెపి పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు
-
News1 day ago
మురికి కాలువలో మృతదేహం