News
కార్మిక సమస్యల పరిష్కరం కోసమే ఎంప్లాయిస్ యూనియన్
ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా ఆదోని డిపో ఏపీ పీటిడి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం ముందు 73వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వి. బ్రహ్మయ్య ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కార్మిక సమస్యల పరిష్కరించడం కోసమే ఎంప్లాయిస్ యూనియన్ పెట్టిందని నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా ఉద్యోగులకు వైద్య సౌకర్యం పని గంటల విధానం వారాంతపు ఆఫ్ అనేక సంక్షేమ పథకాలు సాధించడంతోపాటు సంస్థ మనుగడ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నుండి అనేక రాయితీలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. యాజమాన్యంతో మరియు ప్రభుత్వంతో నిత్యం మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చేస్తున్నామని అన్నారు.

ఈ వార్షికోత్సవానికి జిల్లా అధ్యక్షులు రంగస్వామి, సీనియర్ నాయకులు లక్ష్మన్న, జోనల్ నాయకులు పి పి రాముడు, డిపో కార్యదర్శి ఉల్లిగప్ప, గ్యారేజ్ కార్యదర్శి మెసేరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు, సిసిఎస్ రమణమూర్తి, జిల్లా నాయకులు సుధాకర్, ట్రెజరర్ గౌడ్, నాయకులు రమేష్, ప్రసాద్, బియల్ బాబు, గ్యారేజ్ నాయకులు మరియు రన్నింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
కర్నూలు జిల్లా ఆదోని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని , NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు టర్నింగ్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసన పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం చాలా దారుణంఅని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News
ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి
ఆదోని: కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) ఆదోని డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (జూలై 19న) స్థానిక రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఎన్నికల అధికారి శ్రీ డి. నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పదవులకు పోటీ జరగ్గా, మరికొన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం 2026-2029 కాలానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:
- ప్రెసిడెంట్: రజినీకాంత్ రెడ్డి (కౌతాళం తహశీల్దార్)
- అసోసియేట్ ప్రెసిడెంట్: జె. బాబు (ఆదోని డిప్యూటీ తహశీల్దార్)
- సెక్రటరీ: వలిబాషా (పెద్దకడుబూరు తహశీల్దార్)
- ట్రెజరర్: రాఘవేంద్ర
- వైస్ ప్రెసిడెంట్లు: రుద్రగౌడ్, జెర్మియా, కౌసర్ భాను
- జాయింట్ సెక్రటరీ: మహేష్
- ఎగ్జిక్యూటివ్ మెంబర్: రామయ్య
- స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ: బి. పెద్దయ్య

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు రెవెన్యూ శాఖ అధికారులు, సహచర ఉద్యోగులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, సేవా సమస్యల పరిష్కారానికి, రెవెన్యూ శాఖ అభివృద్ధికి మరియు ఉద్యోగుల ఐక్యతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

News
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న 1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.
డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.



-
News2 weeks agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News2 weeks agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News2 weeks agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News2 weeks agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
-
News2 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News1 week agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News2 weeks agoనిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
