News
శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని సిపిఎం పార్టీ పాదయాత్ర

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని చాలా గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజానీకానికి తక్షణమే త్రాగునీళ్ళు అందించాలని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మే 11 12 13 తేదీలలో సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం పెద్ద తుంబలం గ్రామం నుంచి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్న త్రాగడానికి మంచి నీళ్లు కావాలని అడగడం సిగ్గుచేటని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికోసం పనిచేస్తున్నాయని వారు ప్రశ్నించారు. గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకులు పైప్ లైన్ ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా నీళ్లు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికైనా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని త్రాగునీరందించాలని వారు డిమాండ్ చేశారు.

సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర పెద్దతుంబలం నుండి ప్రారంభమై నెట్టేకల్ వరకు కొనసాగుతుందని మూడు రోజులపాటు 80 కిలోమీటర్లు 22 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి మే 14న ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ కార్యాలయం ముందు మహా ధర్నాతో ముగుస్తుందన్నారు.

ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, నేషనల్ స్కూల్ స్కరస్పాండెంట్ D కృష్ణమూర్తి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, రామాంజనేయులు, పాండవగల్ గ్రామ సర్పంచ్ కె ఉమాదేవి, పార్టీ మండల నాయకులు అయ్యప్ప, హనుమంత్ రెడ్డి, పాండురంగ, అయ్యన్న, మునిస్వామి పార్టీ సీనియర్ సభ్యులు దాసప్ప నాయుడు, ఈరన్న, శాఖ కార్యదర్శులు జి.విరుపాక్షి, కే గోవిందు, కె వెంకటేష్, ఎస్ అనిఫ్ భాష, వీరేష్ పార్టీ సభ్యులు లక్ష్మన్న, గర్జప్ప, హనుమంత్ రెడ్డి, కాజా, తదితరులు పాల్గొన్నారు.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 31-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.83 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 75.934 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 52878 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 51317 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 31 07 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.62 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 75.837 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 101537 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 94488 క్యూసెక్కులు
-
News4 weeks ago
తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల
-
News4 weeks ago
తుంగభద్రా డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
News4 weeks ago
తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News4 weeks ago
తుంగభద్రా డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025
-
News4 weeks ago
తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 04-07-2025