News
స్పందన అర్జీలను గడవు లోపు పరిష్కారం చూపాలి
కర్నూలు జిల్లా..
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని.

- ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన లొడ్డ ఈరన్న సంబంధించి గత కొద్ది రోజుల క్రితం నివాసముంటున్న మా యెక్క ఇల్లు కూలిపోయినది. అందులో మా ఇంటికి సంబంధించిన పత్రాలు పోగొట్టుకుపోయాయి. ప్రస్తుతం సదరు ఇంటికి సంబంధించిన పత్రాలు నకలు పత్రాలు ఇవ్వవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- నందవరం మండలం పులిచింత గ్రామానికి చెందిన పోతురాజు నాగన్న సంబంధించి గ్రామంలో సుమారు 20 సంవత్సరాలుగా 2.50 సెంట్ల ఇంటి స్థలం లో నివాసం ఉంటున్నాము. దయతో సదరు ఇంటి స్థలం కు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన అంజనమ్మకు సంబంధించి సర్వే నెంబర్ 101/డి నందు 1.17 ఎకరాల భూమి ఉన్నది సదరు భూమి ఆన్లైన్ నందు 2.17 ఎకరాలుగా భూమి గా చూపిస్తుంది. దయతో సదరు భూమిని విచారణ చేసి నా యొక్క భూమిని మాత్రము ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- మద్దికేర మండలం పెరవల్లి గ్రామానికి చెందిన బి. వెంకట సాయి రంగ సంబంధించి గత మాసంలో ఐచర్ వాహనం కొనుగోలు చేయడం జరిగినది. సదరు వాహనం రిజిస్ట్రేషన్ సాంకేతిక సమస్య వలన ఆలస్యమవుతున్నదని దయతో త్వరగా నా యొక్క వాహన రిజిస్ట్రేషన్ త్వరగా చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న కార్యాలయపు పరిపాలన అధికారి శేషయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ వేణు సూర్య, శ్రీనివాస రాజు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, ఆర్టీవో నాగేంద్ర , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతన్ ప్రియ, ఉప తాసిల్దారులు వినీత్, కౌసార్ భాను, పౌరసరఫరాల శాఖ ఉప తాసిల్దార్ వలి భాష తదితర అధికారులు పాల్గొన్నారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
