News
అబివృద్ది పై సమీక్ష సమావేశం
కర్నూలు జిల్లా ఆదోని , ఆలూరు నియోజక వర్గాల అబివృద్ది పై సమీక్ష సమావేశం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం , జిల్లా పరిషత్ చైర్మన్ , స్థానిక సంస్థల MLC – Dr మదూసుధన్ , మున్సిపల్ చైర్మన్ శాంత , ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మరియు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆదోని , ఆలూరు అబివృద్ది కి స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన ప్రతిపాదనల పై చర్చలు జరిగాయని. అందులో భాగంగా ఆదోని లో బైపాస్ నిర్మాణం , ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , మైనారిటీ జూనియర్ కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకం, ఆటో నగర్ ఏర్పాటు , SS ట్యాంక్ మరమ్మత్తులు , పలు గ్రామాలకు రోడ్డు , త్రాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రతిపాదన ఇవ్వగా , ఆలూరు నియోజక వర్గం నుండి జింకల పార్కు , గ్రామాలకు త్రాగు నీరు , రోడ్డు సౌకర్యం, అంగన్వాడీ కేంద్రాలు , సంతమార్కెట్ , MRO ఆఫీస్ భవనం , R&B వసతి గృహం , రైతు భరోసా కేంద్రాల నిర్మాణం , ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీస్ , ఆస్పరి మండలంలో పొట్లపాడు వంతెన నిర్మాణం , దేవనకొండ లో మోడ్రన్ స్కూల్ ఏర్పాటు , PHC ల మరమ్మతులు వంటి సమస్యల పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




